Priyanka Gandhi detained over bid to visit kin of deceased ‘‘ఇది రైతు దేశం.. బీజేపిది కాదు’’: ప్రియాంక గాంధీ

Lakhimpur kheri violence priyanka gandhi detained over bid to visit kin of deceased

Lakhimpur kheri news, Lakhimpur kheri protest, Farmer Gherao, Lakhimpur Kheri, Farmer Protest, Farmer Protest Today, Farmer dead, Priyanka Gandhi, Congress, TMC, Bjp, Chattisgarh CM, Lakhimpur Kheri, Lakhimpur Kheri Updates, Assam, farmer protest updates, accident, farmer death, Ajay Mishras son, Uttar Pradesh, Crime

Congress leader Priyanka Gandhi Vadra was detained early by the Uttar Pradesh police as she headed to meet the families of the farmers killed in the wake of violence during an anti-farm laws protest the previous day.

‘‘ఇది రైతు దేశం.. బీజేపిది కాదు’’: లక్ష్మీపూర్ ఖేరి హింసపై ప్రియాంక గాంధీ

Posted: 10/04/2021 11:43 AM IST
Lakhimpur kheri violence priyanka gandhi detained over bid to visit kin of deceased

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢి్ల్లీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఏకంగా పది నెలల నుంచి తాము నిరసన దీక్షలు చేపట్టినా కేంద్రం స్పందించడం లేదని.. అగ్రహించిన రైతులు బీజేపి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు సందర్శించనున్న ప్రాంతాలకు వెళ్లి.. వారిని అడ్డుకుని.. తమ నిరసనలపై అక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు బీజేపి నేతలపై హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో తమ అవేశంతో వాహనాలను అడ్డుకున్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

కాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ల‌ఖింపూర్ ఖేరీలో అదివారం రోజుల పలువురు రైతులు కేంద్రమంత్రి అజయ్ మిశ్ర తనయుడు ఆశీష్ వాహనాన్ని అడ్డున్నారు. దీంతో రైతులను నెట్టుకుంటూ కేంద్రమంత్రి తనయుడి వాహనంతో పాటు మూడు వాహనాలు అలా వెళ్లడంతో అందోళన చేస్తున్న రైతులలో ఏకంగా నలుగురు రైతులు అసువుల బాసారు. ఈ మూడు ఎస్యూవీ కార్లలో ఒకటి కేంద్రమంత్రి తనయుడు అశీష్ నడిపిస్తున్నారని రైతులు అరోపించారు. ఇక ఈ ఘటనలో మరో నలుగురు కూడా అసువులు బాసారు. ఆగ్రహించిన రైతులు కేంద్రమంత్రి తనయుడిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేయడంతో ఆయనపై ఎస్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై మరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని తెలిపారు,

ఈ ఘటన నేపథ్యంలో రైతుల తీవ్ర ఆవేశంతో రగలిపోయారు. ఈ క్రమంలో ఓ వాహనానికి నిప్పు పెట్టి మరీ ఎత్తి పడేశారు. కాగా, అసువులు బాసిన రైతుకుటుంబాలతో పాటు మరో నలుగురి మృతుల కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు సోమ‌వారం ఉద‌యం ప్రియాంక వెళ్తుండ‌గా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌పై ప్రియాంక గాంధీ మండిప‌డ్డారు.బాధిత కుటుంబాల క‌న్నీళ్లు తుడిచేందుకు వెళ్తున్నాన‌ని ఆమె పేర్కొన్నారు. తాము ఎలాంటి నేరం చేయ‌లేదు.. ఎందుకు అడ్డుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. త‌న‌కు లీగ‌ల్ ఆర్డ‌ర్ ఇచ్చి అడ్డుకోవాల‌న్నారు. ఒక వేళ త‌న‌ను బ‌ల‌వంతంగా పోలీసు కారులో ఎక్కిస్తే.. మీపై కిడ్నాప్ కేసు పెడుతాన‌ని హెచ్చ‌రించారు.

దేశంతో పాటు బీజేపి పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ తీరు విచారకరంగా వుందని అమె దుయ్యబట్టారు. ఈ దేశమే తమదన్నట్లుగా బీజేపీ పాలన సాగుతోందని అక్షేపించారు. భారత్ అంటేనే వ్యవసాయ ఆధారిత దేశమని, అంటే ఇది సంపూర్ణంగా రైతుల దేశమని చెప్పారు. ఈ దేశమే తనదన్నట్లు బీజేపీ వ్యవహరిస్తున్న తీరు సరి కాదని అన్నారు. ఈ దేశంలో తొలుతు జీవించే హక్కు రైతులకే వుందని అమె అన్నారు. అలాంటిది బీజేపి పాలిత రాష్ట్రాల్లో మాత్రం రైతుల‌కు జీవించే హ‌క్కు లేకుండా చేస్తున్నారని అమె మండిపడ్డారు? రాజ‌కీయాల‌తో రైతుల‌ను అణ‌చివేస్తారా? అని ప్ర‌శ్నించారు. గ‌త కొన్ని నెల‌లుగా రైతులు త‌మ గ‌ళాన్ని వినిపిస్తున్నారు. రైతుల ఆందోళ‌న‌ల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్రియాంక గాంధీ కోపోద్రిక్తుల‌య్యారు.

ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్‌ ఖీరీ జిల్లాలో రేగిన హింసాత్మతక ఘటనల నేపథ్యంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం భూపేష్ భ‌గేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్‌జింద‌ర్ ఎస్ రాంధావా ప్ర‌క‌టించిన నేపథ్యంలోనూ యూపీలోని యోగి సర్కారు వారికి కూడా అనుమతి నిరాకరించింది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ల‌క్నో ఎయిర్‌పోర్టులో వారిద్ద‌రిని ల్యాండ్ అయ్యేందుకు అనుమ‌తించొద్ద‌ని యూపీ అడిష‌న‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ అవ‌నిష్ అవస్థి ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సీతాపూర్ వ‌ద్ద ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles