We will not tolerate conversions, says MP Pratap Simha మదర్ థెరిస్సాపై బీజేపీ ఎంపీ ప్రతాప సింహా వివాదాస్పద వ్యాఖ్యలు..

Congress leaders demand action against mysuru mp s provocative statements

Congress leaders, Mysuru MP, Pratap Simha, ‘provocative’ statements, Saints, Hinduism, Chirstainity, Bangaluru, Karnataka Politics

Taking serious objection to BJP MP Pratap Simha’s allegedly provocative statements that threaten communal peace in the society, Mysuru District Congress Committee has urged Deputy Commissioner of Mysuru Bagadi Gautham to immediately take action against the MP.

మదర్ థెరిస్సాపై బీజేపీ ఎంపీ ప్రతాప సింహా వివాదాస్పద వ్యాఖ్యలు..

Posted: 09/25/2021 07:37 PM IST
Congress leaders demand action against mysuru mp s provocative statements

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ థెరిస్సాపై మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రజలను రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేసిన మైసూరు పార్లమెంటు సభ్యుడు ప్రతాస్ సింహాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య శాంతి సామరస్యతకు విఘాతం కలిగిస్తూ.. రెచ్చగోట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు, ఈ మేరకు కాంగ్రెస్ నేతలు మైసూరు డిఫ్యూటీ కమీషనర్ తమ పిర్యాదును అందజేశారు. తమ అరోపణలను ఖండించలేనివారిపై నోరుజారడం బీజేపి నేతలకు అలవాటుగా మారిందని వారు దయ్యబట్టారు.

నంజన్‌గూడ్ తాలూకా మానేరులోని అగ్రహారంలో ఇటీవల అధికారులు కూల్చివేసిన శతగణపతి దేవాలయాన్ని కూల్చడంతో అక్కడకు చేరుకున్న ఎంపీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడి అనుగ్రహం వుండటం వల్లే తామకు ఐదు గుంటల భూమి లభ్యమైందని, తాము అక్కడ గణపతి దేవాలయాన్ని నిర్మిస్తామని అన్నారు. ఇక దేవాలయాల కూల్చివేతలు జరగకుండా రక్షణ చట్టం అందుబాటులోకి రావడంకూడా గణపతి మహిమేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మతమార్పుడులపై తీవ్రవ్యాఖ్యలు చేశారు.

తాను మతమార్పిడులకు వ్యతిరేకమని, కానీ బీషన్ లు మాత్రం మతమార్పుడుల వ్యతిరేక చట్టాన్ని చూసి భయపడుతున్నారని ఆయన విమర్శించారు. మతమార్పిడి బిల్లును పార్లమెంటులో పాస్ అమోదం పొందితే తమ ఆటలు సాగవని వారికి తెలిసి బిక్కముఖాలు వేసుకున్నపిల్లుల మాదిరిగా చూస్తున్నారని అరోపించారు. మీరు మత మార్పిడులకు పాల్పడకపోతే బిల్లు పాసైనా అభ్యంతరం ఎందుకని అన్నారు. రుషులు, మహర్షులు కావాలంటే హిందూమతంలో ఎన్నో గొప్ప పనులు చేయాల్సి ఉంటుందని, కానీ క్రైస్తవంలో  సెయింట్ హోదా పొందాలంటే అవేం అక్కర్లేదని, మేజిక్కులు, గిమ్మిక్కులు చేస్తే సరిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

మైసూరులో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళ కడుపులోని కేన్సర్ గడ్డను కరిగించడమనే అద్భుతమైన మేజిక్ చేసిన మదర్ థెరిస్సాకు సెయింట్ హోదా లభించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రైస్తవ సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మదర్ థెరిస్సాపై నోరు పారేసుకున్నందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్  చేశాయి. ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగోట్టి ఎన్నికల్లో లభ్ది పోందాలని బీజేపి నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles