Engineering student pushed to death at Warangal BITS వరంగల్ బిట్స్ కాలేజీలో గ్యాంగ్ వార్.. విద్యార్థి మృతి

Students gangwar engineering student pushed to death at bits warangal

Balaji Institute of Science and Technology, engineering student, engineering student died in BITS, diploma student died in gangwar, students gangwar in BITS, EEE diploma student death, Narsampet, telangana government, Technical Education Dept, Warangal, Telangana,crime

In a shocking incident, a student was pushed to death from the second floor of the hostel building at the Balaji Institute of Science and Technology (BITS) campus here on Friday night. The deceased was identified as N Sanjay (18), a second-year student of the diploma in polytechnic in the EEE branch.

వరంగల్ బిట్స్ కాలేజీలో గ్యాంగ్ వార్.. విద్యార్థి మృతి

Posted: 09/25/2021 01:35 PM IST
Students gangwar engineering student pushed to death at bits warangal

వరంగల్ జిల్లా మరోమారు వార్తల్లో నిలిచింది. వరంగల్ మెడికల్ కాలేజీలో ఓ ఫస్టియర్ స్టూడెంట్ ర్యాగింగ్ చేసిన సీనియర్లు.. విద్యార్థి బట్టలను విప్పించిన నేపథ్యంలో అతని తల్లిదండ్రులు ఏకంగా విద్యాశాఖ మంత్రిని కలిసిన చర్యలకు డిమాండ్ చేయడంతో వార్తల్లో నిలిచిన వరంగల్ జిల్లా.. మళ్లీ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ తో ఓ విద్యార్థి మరణించిన దారుణ ఘటనతో మరోమారు వార్తల్లో నిలిచింది. నర్సంపేటలోని బాలజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్పర్మేషన్ కాలేజీలో ఈ దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న గొడవ ​కాస్త ముదిరి ఒకరి ప్రాణం తీసింది.

రెండో అంతస్తు నుంచి తోసేయడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఆ వివరాలు.. నర్సంపేట బిట్స్ కాలేజీలో నలుగురు విద్యార్థుల గొడవ ప్రారంభం అయ్యింది. చిన్న వాగ్వాదం కాస్త ముదిరి పెద్ద గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. సంజయ్‌ అనే మరో విద్యార్థిని కాలేజ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి తోసేశారు. ఈ ప్రమాదంలో సంజయ్‎కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిట్స్ కళాశాలలోని పాలిటెక్నిక్ చదువుతున్న సెకండియర్ విద్యార్ధి సంజయ్ మృతికి కళాశాల యాజమాన్యం కారణమంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. నర్సంపేట - వరంగల్ ప్రధాన రహదారి ధర్నా, రాస్తారోకో చేశారు. వారికి మద్దతుగా విద్యార్ధి సంఘాల నాయకులు కూర్చున్నారు. అయితే ధర్నా చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles