Covid to Resemble Cold by Next Year: Health Experts వచ్చే ఏడాదికి జలుబుగా కరోనా: అరోగ్య నిపుణులు

Covid to resemble common cold by spring next year health experts

coronavirus, common cold, corona pandemic, ccorona vaccine, Covid-19, health experts, Dame Sarah Gilbert, Oxford university, Sir John Bell, Europe

Nearly two years after the Coronavirus pandemic wreaked havoc across the world, killing millions, leading health experts have said that Covid-19 will eventually be like a common cold. Professor Sir John Bell, professor of medicine at Oxford University told that the virus could resemble the common cold by spring next year as people’s immunity to the virus is boosted by vaccines and prolonged exposure.

కరోనా మటుమాయం కాదు.. కాకపోతే ప్రభావం తగ్గుతుంది: అరోగ్య నిపుణులు

Posted: 09/24/2021 08:33 PM IST
Covid to resemble common cold by spring next year health experts

క‌రోనా వైరస్.. ఈ మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి మందిని బలి తీసుకోగా, కోట్లాధి మందిని తన ప్రభావానికి గురిచేసింది. ఇక దీని పేరు చెబితేనే ప్రజలు భయకంపితులు అవుతున్నారు. ఇలాంటి కరోనా మహమ్మారికి వైద్యరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు ఎప్పుడు అంతం పలుకుతారా అని వేచిచూస్తున్న తరుణంలో దీనికి అంతం లేదన్న వార్త వినిపిస్తోంది. అయితే అంతం లేకపోవచ్చు కానీ.. దాని ప్రభావం కూడా ఇకపై చాలా తక్కువగా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఇది సాధార‌ణ జ‌లుబుగా కరోనా వైరస్ మారిపోతుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వైర‌స్‌కు చాలా కాలంగా అల‌వాటు ప‌డి ఉండ‌టం, వ్యాక్సిన్ల కార‌ణంగా ప్ర‌జ‌ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతో క‌రోనా ఓ సాధార‌ణ జ‌లుబుగా మారిపోతుంద‌ని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ స‌ర్ జాన్ బెల్ అంటున్నారు. ఈ వైర‌స్ వ‌ల్ల యూకే చాలా దారుణ‌మైన ప‌రిస్థితులు అనుభవించింద‌ని, శీతాకాలం దాటితే చాలు ప‌రిస్థితులు మెరుగ‌వుతాయ‌ని ఆయ‌న తెలిపారు. ఇప్పుడున్న ప‌రిస్థితులు చూస్తే.. ఆరు నెల‌ల కింద‌టి కంటే చాలా మెరుగ్గా ఉంది అని జాన్ బెల్ అన్నారు. యూకేలో కొవిడ్ మ‌ర‌ణాలు కూడా చాలా వ‌ర‌కూ వ‌య‌సు మ‌ళ్లిన వారిలోనే సంభ‌విస్తున్నాయ‌ని, అవి కూడా పూర్తిగా కొవిడ్ కార‌ణంగానే అని స్ప‌ష్టంగా చెప్ప‌లేమ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌స్తుతం యూకేలో కేసుల సంఖ్య ఎక్కువ‌గానే ఉన్నా.. ఇప్ప‌టికే వైర‌స్ బారిన ప‌డిన వాళ్లు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు హెర్డ్ ఇమ్యూనిటీకి తోడ్ప‌డ‌తార‌ని ఆయ‌న చెప్పారు. ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ప్రొఫెస‌ర్ డేమ్ సారా గిల్బ‌ర్ట్ కూడా వైర‌స్ వ్యాప్తి ఎక్కువైన కొద్దీ అవి బ‌ల‌హీన‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. ఆమె అభిప్రాయంతో జాన్ బెల్ ఏకీభ‌వించారు. త‌న అభిప్రాయం మేర‌కు ఆ ప‌రిస్థితి వ‌చ్చే ఏడాది వసంత కాలం క‌ల్లా వ‌స్తుంద‌ని అన్నారు. కొవిడ్ నుంచి మ‌రో భ‌యాన‌క‌మైన వేరియెంట్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌ని కూడా సారా గిల్బ‌ర్ట్ స్ప‌ష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles