Man Films Intense Lightning Strike In Maharashtra కొల్హాపూర్ పిడుగు.. 18వ అంతస్థు నుంచి తీసిన వీడియో..

Saw people run scream man films intense lightning strike in maharashtra

Lightning strike, frightening video, high-rise building, 18th floor, Kolhapur, smoke rising into air, Maharashtra, Internet, social media, viral video

The frightening video of a lightning strike, captured from a high-rise building in Kolhapur, Maharashtra, is now going viral on the Internet. It showed a massive bolt hitting the surface around 200 metres from the person recording the event. The strike was so intense that it sent smoke rising into the air.

ITEMVIDEOS: కొల్హాపూర్ పిడుగు.. 18వ అంతస్థు నుంచి తీసిన వీడియో..

Posted: 09/24/2021 05:21 PM IST
Saw people run scream man films intense lightning strike in maharashtra

మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన మొబైల్ లో చిత్రీకరించిన వీడియో భీతిగొల్పుతున్నది. కొల్హాపూర్‌లోని ఒక బహుళ అంతస్థు భవనం నుంచి తీసని ఈ వీడియోలో వర్షం నేపథ్యంలో స్థానికంగా పడిన పీడుగు పాటు ఎంతటి భయానకంగా వుందో ఇట్టే అర్థమవుతోంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ లోని నెటిజనులను భయాందోళనకు గురిచేస్తోంది. మొబైల్ లో రికార్డు చేసిన వ్యక్తికి సుమారు 200 మీటర్ల దూరంలో భారీ విస్పోటన శబ్దంతో పిడుగుపడింది.

పిడుగు తీవ్రత అధికంగా వున్న కారణంగా ఒక్కసారిగా అక్కడ ఓ ఇరవై నుంచి ఇరవై అయిదు మీటర్ల భూమి ఉపరితలంపై నిప్పుతో కూడిన పోగ వ్యాపించింది. భారీ పేలుడు పదార్థాలతో కూడిన విస్పోటనం జరిగినట్లు తలపించింది. ఆ వెంటనే చాలా పెద్దగా ఉరుముల శబ్దం వినిపించింది. దీంతో ఈ వీడియోను చిత్రీకరించిన వ్యక్తి దాని శబ్దాన్ని తట్టుకోలేక గది కిటీకీని మూసివేశారు. కోల్హాపూర్ కు చెందని రాకేశ్ రౌత్ ఈ విడియోను వైరల్ హాగ్ కు అందజేశాడు. దీంతో వారు ఈ వీడియోను అంతర్జాలంలో షేర్ చేశారు.

దీంతో పాటు రౌత్ ఎప్పుడు వీడియోను చిత్రీకరించిందీ కూడా పోందుపర్చారు. వర్షం కారణంగా బయటకు వెళ్లలేకపోవడంతో మధ్యహ్న బోజనం తరువాత నిద్రకు ఉపక్రమించిన రాకేశ్ రౌత్.. ఉరుములు, పిడుగుల శబ్దాలకు నిద్ర పట్టక లేచాడు. తన 18వ అంతస్థు నుంచి చూడగా, తుఫాను వాతావరణం వల్ల భయటంతా ఒక్కేటే వర్షం. దీనికి తోడు ఉరుముల శబ్దాలు, పిడుగు పాట్లు దీంతో తన కిటీకిని తీసి చూడసాగాడు. ఈ వర్షాన్ని తన ఫోన్ లో బంధించాలని భావించి తన మొబైల్ ఫోన్ కెమెరాను ఆన్ చేసిన రికార్డు చేశాడు.

ఇలా రికార్డు చేస్తుండగా, పిడుగులు పడ్డాయని.. వాటిలో ఒక్కదాన్ని తాను ఫోన్ రికార్డు చేస్తుండగా పడిందని చెప్పాడు. అది అత్యంత తీవ్రతతో కూడినది కావడం చేత ఏకంగా పడిన వెంటనే భూమి ఉపరితలంపై పోగ వ్యాపించిందని చెప్పాడు. 49 సెకన్ల వీడియోలో 18 వ సెకనులో, ఈ పిడుగు పాటును చూడవచ్చు. కొన్ని సెకన్ల తరువాత, పక్షుల మంద సురక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ ఎగురిపోతూ కూడా కనిపిస్తోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 5వేల కంటే ఎక్కువ వీక్షణలు వచ్చాయి. ఈ సంఘటన మే 4, 2021 న కొల్హాపూర్‌లో జరిగింది, అయితే ఈ వీడియో ఇటీవల యూట్యూబ్‌లో వైరల్ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles