HC suspends GO nominating special invitees to TTD టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు భంగపాటు..

High court temporarily suspended go nominating special invitees to ttd

AP High Court, Gazzete Order, AP Government, Special Invitees, Tirumala Tirupati Devasthanam Board, Petition, High court interim order, Andhra pradesh, Politics

The Andhra Pradesh High Court on Wednesday temporarily suspended the GO issued by the AP government nominating special invitees to the Tirumala Tirupati Devasthanams (TTD) Board. After hearing the petition challenging the state government’s order, the High Court passed an interim order.

తిరుమల ప్రత్యేక ఆహ్వానితులకు భంగపాటు.. జీవోపై హైకోర్టు సస్పెన్షన్.!

Posted: 09/22/2021 03:12 PM IST
High court temporarily suspended go nominating special invitees to ttd

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. టీటీడీ బోర్డులో సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత భానూప్రకాశ్ రెడ్డి, జనశక్తి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్ కుమార్, టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు సహా పలువురు పిటిషన్లను దాఖలు చేశారు.

నిబంధనలను తోసిరాజుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సభ్యులను నియమించారని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. దాని వల్ల సామాన్య భక్తులపై పెనుభారం పడుతుందని వాదించారు. పిటిషనర్ల వాదనలను విన్న రాష్ట్ర హైకోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వులపై తీవ్రంగా మండిపడింది. నిబంధనలకు విరుద్దంగా ప్రత్యేక అహ్వానితుల నియామకం పై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. కాగా, ఇటీవల ఏపీ ప్రభుత్వం టీటీడీ బోర్డులో 25 మంది సభ్యులను నియమించింది.

గతంలో 18 మంది బోర్డు సభ్యుల సంఖ్యను 25కు పెంచిన విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. అందులో కొందరు ప్రమాణం కూడా చేశారు. అయితే, వివిధ కేసుల్లో ఉన్న వారినీ పవిత్రమైన బోర్డులో నియమించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ నియామకాలను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఫార్సు చేశారంటూ ఒక సభ్యుడి నియామకంపై ఓ లేఖ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఎవరినీ సిఫార్సు చేయలేదని తర్వాత కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP High Court  Gazzete Order  AP Government  Special Invitees  TTD Board  Petition  Andhra pradesh  Politics  

Other Articles