Justin Trudeau Hatrick Win with less Majority కెనడాలో మళ్లీ లిబరల్ పార్టీ విజయం.. జస్టిన్ ట్రూడో హ్యాటిక్

Justin trudeau wins third term but falls short of majority

Canada elections, Canada prime ministerial elections, Prime Minister Justin Trudeau, Trudeau wins, Canadian Liberals, Quebec, Canada coronavirus pandemic, Canadians reject conservative government, Canada immigration laws Erin O’Toole, Canada, Justin Trudeau, Canada election results, Bloc Quebecois, Liberal Party, justin trudeau news, canada election 2021, canada election 2021 results, canada election, canada election results, election results, canada election 2021 results date

Canadian Prime Minister Justin Trudeau hung onto power as his main rival conceded defeat, but his Liberals fell short of his goal for a majority win. Trudeau, in power since 2015 and governing with a minority of House of Commons seats since 2019, decided to gamble on an early vote and capitalize on his government’s handling of the pandemic

కెనడాలో మళ్లీ లిబరల్ పార్టీ విజయం.. జస్టిన్ ట్రూడో హ్యాటిక్

Posted: 09/21/2021 05:01 PM IST
Justin trudeau wins third term but falls short of majority

కెన‌డా ప్ర‌ధానిగా లిబరల్ పార్టీ అధినేత జ‌స్టిన్ ట్రూడో హ్యాట్రిక్ విజయం సాధించారు. తాజా ఎన్నిక‌ల్లో తామే గెలిచిన‌ట్లు ఆయ‌న స్వయంగా ప్ర‌క‌టించారు. సంపూర్ణ మెజారిటీ రాకపోయినా అత్యధిక స్థానాల్లో గెలుపోందిన ఆయన పార్టీ అధికారాన్ని అందుకుంది. దీంతో కెన‌డాలో తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోనున్న‌ట్లు జ‌స్టిన్ ట్రూడో చెప్పారు. లిబ‌ర‌ల్ పార్టీ త‌ర‌పున ట్రూడో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా పోటీలో నిలిచారు. క‌న్జ‌ర్వేటి పార్టీ నుంచి ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది. లిబ‌ర‌ల్ పార్టీ అత్య‌ధిక సీట్లు గెలిచినా.. సంపూర్ణ మెజారిటీని సాధించ‌లేక‌పోయింది. ట్రూడో త‌న అధికారాన్ని నిల‌బెట్టుకున్నారు. ఓటింగ్లో పాల్గొన్న కెన‌డ‌న్ల‌కు ట్రూడో థ్యాంక్స్ తెలిపారు.

లిబ‌ర‌ల్ జ‌ట్టుపై న‌మ్మ‌కం ఉంచినందుకు కెనడెన్లకు ధన్యవాదాలు చెప్పిన ఆయన దివ్య‌మైన భ‌విష్య‌త్తును ఎన్నుకున్న‌ట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రజలతో తన విజయాన్ని పంచుకున్నారు. కోవిడ్‌పై పోరాటాన్ని ముగిస్తామ‌న్నారు. కెన‌డాను ముందుకు తీసుకువెళ్ల‌నున్న‌ట్లు ట్రూడో తెలిపారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు మెజారిటీ 170 సీట్లు కావాలి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. లిబ‌ర‌ల్ పార్టీ 157 సీట్ల‌లో విజ‌యం సాధించింది. ఇక క‌న్జ‌ర్వేటి పార్టీ 122 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా దాదాపు 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.

నిజానికి మైనార్టీ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న ట్రూడో.. గ‌త ఆగ‌స్టులో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్ల‌కే ఆయ‌న ఎన్నిక‌ల‌కు పిలుపునిచ్చారు. అయితే ఈసారి కూడా గెలిచినా.. ట్రూడో మాత్రం తాను అనుకున్న‌ట్లు మెజారిటీ సాధించ‌లేక‌పోయారు. కెన‌డా చరిత్ర‌లోనే ఇది అత్యంత ఖ‌రీదైన ఎన్నిక‌లుగా చెబుతున్నారు. 2019లో గెలిచిన సీట్ల‌తో పోలిస్తే, ఈ సారి మూడు సీట్ల‌ను లిబ‌ర‌ల్ పార్టీ కోల్పోయింది. మెజారిటీ సాధించ‌లేక‌పోయినా.. ట్రూడోనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. సంపూర్ణ మెజారిటీ లేకుండా ఏ ప‌నీ పూర్తి చేయ‌లేమ‌న్న న‌మ్మ‌కంతో ట్రూడో మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles