groom dancing welcome to bride at wedding ‘‘పెళ్లి మండపంలోకి వధువుకు వరుడి ఘనస్వాగతం’’

Desi groom welcomes bride at the wedding venue with superb dance performance

wedding video, viral wedding video, desi groom, desi groom dance, wedding dance, wedding dance video, groom dance video, bride and groom wedding video, lovely couple, viral news, viral wedding post, trending video, wedding video viral post

A video of a groom welcoming his bride at the wedding venue with a dance performance has gone viral on the Internet. The bride can be seen walking into the wedding venue under the ‘phoolon ki chadar’ accompanied by her brothers when the groom comes dancing to her.

ITEMVIDEOS: ‘‘పెళ్లి మండపంలోకి వధువును గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన వరుడు’’

Posted: 09/20/2021 12:45 PM IST
Desi groom welcomes bride at the wedding venue with superb dance performance

పెళ్లంటే అనాదిగా వస్తున్న ఓ సంప్రదాయం. ఎన్నో ఆచార వ్యవహారాల కలయికతో ఒక్కటయ్యే ఈ బంధంలో వధూవరుల నుండి వారి తల్లిదండ్రులు, బంధువుల వరకు ఎవరి ప్రాధాన్యత వారికి ఇమిడి ఉంటుంది. అయితే.. వివాహాల వ్యవహరాల్లోనూ గాంధర్వ వివాహాలు.. స్వయంవరాలు వచ్చేసినట్టుగానే.. మారుతున్న కాలంతో పాటు యువతలోనూ జీవితకాలంలో ఒక్కసారి జరిగే పెళ్లిని ఆనందోత్సహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని.. ఆచార వ్యవహరాలకు ప్రాధాన్యతను పక్కనబెట్టి మరీ రంజుగా మార్చేస్తున్నారు. ఇన్నాళ్లు వదువులు తమ డాన్సులతో వరుడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయగా, తాజాగా ఆ అవకాశాన్ని తాను ఎందుకు తీసుకోరాదని అనుకున్నాడు ఓ వరుడు.

ఇన్నాళ్లు వధువులు డాన్స్ తో అదరగొట్టి వరుడికి గ్రాండ్ వెల్ కమ్ చెబితే.. తాను మాత్రం అందుకు భిన్నంగా తన కాబోయే జీవిత భాగస్వామికి ఘనస్వాగతం పలకాలని అనుకున్నాడు. పెళ్లి తాలుకు మ‌ధుర క్ష‌ణాల‌ను, ఆ జ్ఞాప‌కాల‌ను జీవితాంతం గుర్తుంచుకునేలా చేసుకున్నాడు. ఇక తన పెళ్లికి సంబంధించిన వీడియోను తన వారసులు, వారి వారసులతో కూడా పంచుకునేలా చాలా అందంగా డిజైన్ చేసుకోవాలని వధువుకు వెల్ కమ్ చెప్పాడు. ఇటీవల ఓ వరుడు పెళ్లైన వెంటనే తన భర్త ఆశీర్వాదం తీసుకున్న వధువును వద్దని భుజాలు పట్టుకున్ని లేపిన వరుడు.. అమె కాళ్లకు నమస్కారం చేసి.. మహిళలకు సమాజంలో సమానహక్కు ఉందని చాటిన విషయం తెలిసిందే.

తాజాగా.. అటువంటిదో మ‌రో వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. కొద్ది సేప‌ట్లో త‌న పెళ్లి ప్రారంభం అవుతుంద‌న‌గా.. పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయ‌డం స్టార్ట్ చేస్తాడు. ఇంత‌లో పెళ్లికూతురు న‌డుచుకుంటూ వ‌స్తుంది. త‌న‌ను చూస్తూ ఇంకా స్టెప్స్ పెంచుతాడు. త‌న ద‌గ్గ‌రికి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లి త‌న‌ను కౌగిలించుకుంటాడు. పెళ్లి కాక‌ముందే.. పెళ్లి కొడుకు.. వ‌ధువుపై చూపించే ప్రేమ‌ను చూసి పెళ్లికి వ‌చ్చిన అతిథులు అంతా షాక్ అవుతారు. నెటిజ‌న్లు కూడా ఆ వీడియోను చూసి.. ఆ పెళ్లికొడుకును మెచ్చుకుంటున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by THE CHOPRA EVENTS (@thechopraevents)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : desi groom  desi groom dance  wedding dance  wedding dance video  groom dance video  trending  

Other Articles