Puri Jagannadh, Tarun receive good news in drugs case డ్రగ్స్ కేసులో మరో ట్విస్టు.. డైరెక్టర్ పూరి. తరణ్ లకు ఊరట

Tollywood drugs case puri jagannadh tarun receive good news

director Puri Jagannadh, actor Tarun, drugs racket, Forensic Lab, Drug case, blood samples, Tollywood drug scandal news, director Puri Jagannadh news, actor Tarun, drugs racket, Rana Daggubati drugs case, rakul preet singh, enforcement directorate, Forensic Science Laboratory, Hyderabad, Telangana Police, crimeq

Star director Puri Jagannadh and actor Tarun were questioned by the SIT in connection with a drugs racket in 2017. Recently, the ED questioned Puri in connection with the same case for several hours in Hyderabad. The Forensic Science Laboratory gave a clean chit to the Puri-Tarun duo. The FSL stated that there is no evidence that the 'Liger' director and the 'Nuvve Kavali' actor had consumed drugs.

డ్రగ్స్ కేసులో మరో ట్విస్టు.. డైరెక్టర్ పూరి. తరణ్ లకు ఊరట

Posted: 09/18/2021 07:22 PM IST
Tollywood drugs case puri jagannadh tarun receive good news

టాలీవుడ్‌ డ్రగ్‌ కేసు, మనీలాండరింగ్‌ కేసులో ఓ వైపు ఎన్ ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ ​(ఈడీ) టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను రోజువారీగా విచారిస్తోంది. ఈ తరుణంలో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, తరుణ్‌లకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(ఎఫ్ఎస్‌ఎల్‌) క్లీన్ చిట్‌ ఇచ్చింది. 2017లో వాళ్లు ఇచ్చిన గోళ్లు, వెంట్రుకలు, రక్తం నమునాల్లో డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్‌  ల్యాబ్‌ తేల్చి చెప్పింది. కాగా, 2017 లో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో డ్రగ్స్ కేసు పెనుసంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

ఈ కేసుతో అభియోగాలను ఎదుర్కోన్న సినీ ప్ర‌ముఖుల‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అప్పుడే వీరిని ఈడీ అధికారులు విచారించి.. వాంగ్మూలాలు కూడా సేక‌రించారు. వాటిని కోర్టుకు కూడా స‌మ‌ర్పించారు. కానీ.. ఆ కేసుకు సంబంధించి.. మ‌నీల్యాండ‌రింగ్ జరిగిందా? లేక ఫేమా చ‌ట్టాన్ని ఉల్లంఘించారా? అనే వివ‌రాలు తెలుసుకోవ‌డం కోసం.. మ‌ళ్లీ 12 మందికి ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. అందులో 10 మంది సినీ ప్ర‌ముఖులు ఉన్నారు. ఆగ‌స్టు 31, 2021న డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్‌ను విచారించిన ఈడీ అధికారులు.. ఆ తరువాత చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, న‌వ‌దీప్‌, రాణా, ముమైత్ ఖాన్ తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ప‌లువురు సెల‌బ్రిటీల‌ను ఈడీ అధికారులు విచారించారు.

అయితే.. నాలుగేళ్ల క్రిత‌మే.. డ్ర‌గ్స్ టెస్ట్ కోసం పూరీ జ‌గ‌న్నాథ్‌, న‌టుడు త‌రుణ్‌.. ఇచ్చిన నమూనాలలో వారు మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు లేదని తాజాగా ఫోరెన్సిక్ ట్యాబ్ నివేదిక ఇచ్చింది. వారు త‌మ ర‌క్తం, వెంట్రుక‌లు, గోర్ల శాంపిల్స్‌ను ఈడీకి అందించారు. వీళ్లిద్ద‌రు మిన‌హా.. మిగ‌తావాళ్లు ఎవ్వ‌రూ శాంపిల్స్ ఇవ్వ‌లేదు. అప్పుడే వీళ్ల శాంపిల్స్‌లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు లేవ‌ని తేలింది. తాజాగా.. ద‌ర్శ‌కుడు పూరీ, త‌రుణ్‌ న‌మూనాల్లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు 100 శాతం లేవ‌ని ఎఫ్ఎస్ఎల్‌ క్లీన్ చిట్ ఇచ్చింది. కాగా, పూరీ, త‌రుణ్‌ స్వ‌చ్ఛందంగానే త‌మ ర‌క్తం, గోర్లు, వెంట్రుక‌లు ఇచ్చార‌ని ఎక్సైజ్ శాఖ వెల్ల‌డించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles