I-T dept surveys Sonu Sood's residence on day 2 రెండోరోజు సోనుసూద్‌ ఇంట్లో ఐటీ సోదాలు

Income tax department surveys sonu sood s residence on day 2

income tax department officials sonu sood, it dept sonu sood, it raid sonu sood, sonu sood, sonu sood news, sonu sood income tax raid, sonu sood mumbai residence, it raid, mumbai, income tax officials, sonu sood, it dept, income tax raid, sonu sood offices, mumbai residence, it raid, mumbai, Crime

A day after Income Tax Department conducted raids at premises linked to Bollywood actor Sonu Sood, tax officials were seen at the actor's home in Mumbai. The tax department continued the survey operation at Sonu Sood's residence in Mumbai on the second day

సోనూసూద్: నిన్న కార్యాలయాల్లో.. ఇవాళ ఇంట్లో ఐటీ దాడులు

Posted: 09/16/2021 04:55 PM IST
Income tax department surveys sonu sood s residence on day 2

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనుసూద్ సినీనటుడిగానే చాలామందికి తెలుసినా.. ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయని విధంగా ఆయన ఆర్తులకు ఆపన్నహస్తం అందించి హీరోగా మారారు. యావత్ దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగ్రింది. ఆయన చేసిన ధాతృత్వ కార్యక్రమాలు ఏడాదిన్నర కాలంగా ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాయి. దేశంలో విధించిన తొలి లాక్ డౌన్ నేపథ్యంలో భోజనం కూడా దొరకకుండా అలమటించిన దినసరి కూలీలు ఆయన ఆహారం అందించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు బోజన సధుపాయాలతో పాటు వారు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయించారు.

కరోనా లాంటి కంటికి కనబడని శత్రువుతో యుద్దం చేస్తూ.. బయటకు వచ్చేందుకు కూడా జంకిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఆయన చేసిన సేవలు.. తన సోంత డబ్బులతో ఏర్పాటుచేసిన బోజనాలు, బస్సులు ఇత్యాది కార్యక్రమాలతో ఆయనను మనస్పూర్తిగా ప్రశంసించారు. అప్పటివరకు ఆయనెవరో కూడా తెలియని ప్రజలకు కూడా సోనుసూద్ తనవంతుగా సాయం చేశారు. ఆపద ముంచుకొస్తున్న సమయంలో తమకు సాయం చేసే దేవుడిగా మారాడని ఆయనను ఎందరెందరో కీర్తించారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ ల్యాండ్ డీల్ విషయంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్టు అనుమానాలతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిన్నంతా సోనుసూద్ కు చెందిన ఆరు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన ఆదాయపు పన్నుశాఖ.. ఇవాళ ఆయన నివాసంలో దాడులు చేపట్టింది. ఇవాళ ఆయన ఇంటికి వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి సోనూసూద్‌ ఇటీవల బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకమయ్యారు. దీనికి తోడు సోనుసూద్‌ రాజకీయాల్లోకి రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ సీఎంతో భేటీ తర్వాత మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే రెండో రోజు ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles