Accused death gives small relief to victims Family: Chiranjeevi రాజు మృతితో చిన్నారి కుటుంబానికి స్వల్ప ఊరట: చిరంజీవి

Megastar chiranjeevi responds on child rape and murder victim death

Saidabad rape case, Victims Family, govt Exgratia, Chiranjeevi, Manchu Manoj, Nani, Sunitha Reddy, Mohamood Ali, Satyavathi Rathode, capital punishment, Accused dead, Pallakonda raju, Saidabad, Saidabad rape, Pallakonda raju, Pallakonda raju dead, Pallakonda raju dies, Railway tracks, station Gahanpur, Pallakonda raju encounter, Hyderabad rape, Telangana, Crime

On the Suicide death of the accused in Saidabad rape case, where a six-year-old child was raped and murdered on Sep 9, Megastar Chiranjeevi and other celebrities had reacted in social media by saying, that this news will bring some sought of relief to the victims family.

సైదాబాద్ నిందితుడి మృతితో చిన్నారి కుటుంబానికి స్వల్ప ఊరట: చిరంజీవి

Posted: 09/16/2021 03:04 PM IST
Megastar chiranjeevi responds on child rape and murder victim death

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచ‌ల‌నం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హ‌త్యాచారం కేసులో నిందితుడు రాజు తనకు తానుగా శిక్షవిధించుకుని చనిపోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కీచకుడు రాజు తనకు తానుగా శిక్షను వేసుకున్నాడని అంటున్నారు, చిన్నారి కుటుంబానికి అండగా టాలీవుడ్ తారలు కూడా అండగా నిలిచారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, నాని, మంచు మ‌నోజ్ సహా పలువురు కామాంధుడికి కఠిన శిక్ష్ విధించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా పాలకొండ రాజు పోలీసుల భయంతో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చాలామంది అతడి మరణం పట్లు చిన్నారి కుటుంబానికి న్యాయ జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో అభం శుభం తెలియ‌ని ఆరేళ్ల చిన్నారిపై హ‌త్యాచారానికి పాల్ప‌డిన రాజు అనే కిరాత‌కుడు త‌న‌కు తాను శిక్ష‌ను విధించుకోవ‌డం బాధిత కుటుంబంతో పాటు మిగ‌తా అంద‌రికి కొంత ఊర‌ట క‌లిగిస్తుంది. ఈ సంఘ‌ట‌న‌పై మీడియా, పౌర స‌మాజం గొప్ప‌గా స్పందించాయిని అన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు ప్ర‌భుత్వంతో పాటు పౌర స‌మాజ చొర‌వ చూపాలని కోరారు.

ఈ తరహా కార్యక్ర‌మాలు ఎవ‌రు చేప‌ట్టినా తన వంతు స‌హ‌కారం అందిస్తానని చిరంజీవి అన్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్ర‌భుత్వం త‌గిన విధంగా ఆదుకోవాలి అని కోరుతూ ఆయ‌న త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను బదులిస్తూ సినీన‌టుడు మంచు మ‌నోజ్ .. ‘ఈ వార్త చెప్పినందుకు థ్యాంక్యూ స‌ర్.. దేవుడు ఉన్నాడు’ అంటూ మంచు మ‌నోజ్ స్ప‌ష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన చిన్నారి ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాడు.

సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యతో చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చిన్నారి ఆత్మగోశ రాజు మృతికి దారితీసిందని చెప్పారు. హత్యాచార ఘటనలు అత్యంత బాధాకరమని వెల్లడించారు. బాలికల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడతామన్నారు. కాగా పల్లకొండ రాజు పోలీసులను చూసి పారిపోతూ వేగంగా వెళ్తున్న కోణార్క్ ఎక్స ప్రెస్ రైలును పట్టాలపైకి ఎదురువెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అతని రెండు చేతులపై మౌనిక అని పచ్చబోట్టు వుండటంతో దానిని చూసి గుర్తించిన పోలీసులు అతడ్ని సైదాబాద్ ఘటనలో నిందితుడని దృవీకరించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh