మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ఐకియా స్టోర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం పరిస్థితి నిలకడగా వుందని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యుల బృందం తెలిపింది. ధరమ్ తేజ్ అరోగ్యంపై అపోలో అసుపత్రివర్గాలు హెల్త్ బులిటెన్ విడదల చేశాయి. సాయి ధరమ్‌కి అపోలో అసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తుండగా, ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరిగిందని, అది పెద్ద సమస్య కాదని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కాగా, సాయి ధరమ్ తేజ్ ను 48 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. ప్రస్తుతానికి తేజ్ ఆరోగ్యంగా నిలకడగానే ఉందని తెలిపారు. త్వరగానే కోలుకుంటాడని, ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పారు. యాక్సిడెంట్‌కు గురవడం వల్ల షాక్‌లో అపస్మారకస్థితిలోకి వెళ్లారని, మరే ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు. కాగా ఇదే విషయాన్ని నిన్న రాత్రి చెప్పిన అల్లు అరవింద్ సాయి ధరమ్ తేజ్ అభిమానులు ఎలాంటి అందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదిలావుండగా, అతివేగంతో వాహనంపై నియంత్రణ కోల్పోయిన సాయిధరమ్ తేజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. నిన్న రాత్రి 8.05 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు అక్కడి సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై 108 సిబ్బంది తమకు సమాచారం అందించినట్టు చెప్పిన పోలీసులు ఘటనా స్థలం నుంచి స్పోర్ట్స్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బైక్ పై వేగంగా వెళ్తుండడంతో నియంత్రించలేక అదుపుతప్పి కిందపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారని మాదాపూర్ డీసీపీ తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అతడిపై నమోదైన పోలీసు కేసుపై మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్టు సాయితేజ్‌పై కేసు పెట్టినట్టుగానే, రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్స్ట్రక్షన్ కంపెనీపైనా, ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేయకుండా ఇసుక పేరుకుపోయేందుకు కారణమైన మునిసిపాలిటీపైనా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకసారి ఇలా కేసులు పెడితే మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడతారని ఆర్పీ ట్వీట్ చేశారు. కాగా, సాయి నడుపుతున్న బైక్ స్కిడ్ కావడానికి రోడ్డుపైనున్న ఇసుకే కారణమని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. స్కిడ్ అయిన బైక్‌ను నియంత్రించలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more