13 airports get approval for privatisation రేణిగుంట సహా 13 విమానాశ్రయాలు.. ఇక ప్రైవేటు పరం..

13 airports get approval for privatisation through clubbing model

Tirupati airport, Renigunta airport, airports, aai, civil aviation, airline industry, GMR Airports, privatisation, aviation industry, airlines latest news and updates, flights, PM Modi, Nirmala Sitaraman, privatisation, National Monetisation Pipeline (NMP), monetisation policy, National, Politics

The board of Airport Authority of India has given approval to privatise 13 airports. This is the first major asset monetisation exercise by the government as part of the National Monetisation Pipeline. The government is aiming for private investment of Rs 3,660 crore in airports by FY24.

తిరుపతి విమానాశ్రయం.. ఇక ప్రైవేటు పరం.. అదే బాటలో మరో 13 ఎయిర్ పోర్టులు

Posted: 09/09/2021 06:09 PM IST
13 airports get approval for privatisation through clubbing model

ప్ర‌భుత్వ ఆస్తుల ద్రవ్యీక‌ర‌ణ విధానం ప‌ట్ల ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అనేక విమర్శలు చేస్తున్నా.. కేంద్రం మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా నగధీకరణకు అడుగులు ముందుకు వేస్తోంది. ఆస్తుల న‌గ‌దీక‌ర‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం తొలి అడుగు వేసింది. దేశంలోని 13 విమానాశ్రయాల‌ను ప్రైవేటీక‌రించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తుది అనుమ‌తి ఇచ్చింది. నేష‌న‌ల్ మానిటైజేష‌న్ పైప్‌లైన్‌లో భాగంగా 2024 ఆర్థిక సంవ‌త్స‌రం నాటికి ఎయిర్‌పోర్ట్‌ల‌లో రూ.3660 కోట్ల ప్రైవేట్ పెట్టుబ‌డుల‌ను ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. 13 ఎయిర్‌పోర్ట్‌ల‌లో ఆరు మేజ‌ర్ ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి.

భువనేశ్వ‌ర్‌, వార‌ణాసి, అమృత్‌స‌ర్‌, తిరుచ్చి, ఇండోర్‌, రాయ్‌పూర్‌ల‌తోపాటు తిరుప‌తి, జార్సుగూడా, గ‌య‌, ఖుషీన‌గ‌ర్‌, కాంగ్రా, జ‌బ‌ల్‌పూర్‌, జాల్గావ్‌లాంటి ఏడు చిన్న ఎయిర్‌పోర్ట్‌లు కూడా ఉన్నాయి. ఒక బిడ్ డాక్యుమెంట్ సిద్ధం చేయ‌డానికి ఇప్పుడు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించ‌నుంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో బిడ్స్‌ను ఆహ్వానించ‌నుంది. ఎయిర్‌పోర్ట్‌ల ప్రైవేటైజేష‌న్ ప్ర‌క్రియ‌లో తొలిసారి మేజ‌ర్ ఎయిర్‌పోర్ట్‌ల‌తో చిన్న ఎయిర్‌పోర్ట్‌ల‌ను క‌లుపుతున్నారు. తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్రయాన్ని తిరుచ్చి ఎయిర్ పోర్ట్ తో క‌ల‌ప‌నుండ‌గా.. జార్సుగూడ‌ను భువ‌నేశ్వ‌ర్‌తో, ఖుషీన‌గ‌ర్‌, గ‌య విమానాశ్రయాల‌ను వార‌ణాసితో, కాంగ్రాను రాయ్‌పూర్‌తో, అమృత్‌స‌ర్‌ను జ‌బ‌ల్‌పూర్‌తో క్ల‌బ్ చేయ‌నున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles