Police arrest Nara Lokesh at Gannavaram airport గన్నవరం ఎయిర్ పోర్టులో నారా లోకేష్ అరెస్ట్

Police arrest nara lokesh at gannavaram airport while on his way to narasaraopet

Nara Lokesh, Nara Lokesh Arrest, Gannavaram airport, Narasaraopet, Victim Family, Andhra Pradesh police, TDP leaders, Andhra Pradesh, Politics

TDP national general secretary Nara Lokesh has been arrested by Andhra Pradesh police. Lokesh, who was on his way from Hyderabad to visit Anusha's family in Narasaraopet, was arrested by the police at Gannavaram airport. While police were moving Nara Lokesh in a vehicle, TDP activists tried to block the police.

గన్నవరం ఎయిర్ పోర్టులో నారా లోకేష్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Posted: 09/09/2021 02:51 PM IST
Police arrest nara lokesh at gannavaram airport while on his way to narasaraopet

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నరసరావుపేట పర్యటన ఉత్కంఠభరితంగా మారింది. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా గోళ్లపాడులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే, లోకేశ్ ను ఎయిర్ పోర్టు నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. విమానాశ్రయం లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. అక్కడి నుంచి ఆయనను ఎక్కడకు తరలిస్తారనే ఉత్కంఠ నెలకొంది. లోకేశ్ కాన్వాయ్ చుట్టూ పోలీసు వాహనాలు అనుసరించాయి. లోకేశ్ మీడియాతోనూ మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక ఆయనను ఎక్కడకు తరలిస్తున్నారనే అంశంపై పోలీసులు మాట్లాడకుండా.. అత్యంత గోప్యంగా ఉంచారు. కాగా లోకేశ్ తో పాటు విమానంలో వచ్చిన పలువురు టీడీపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అంబులెన్సులోకి ఎక్కించారు. అనంతరం వారిని విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ టెర్మినల్ వైపు మళ్లించారు. వారందరి నుంచి లోకేశ్ ను దూరం చేసి, విమానాశ్రయం నుంచి తరలించారు.

గత ఫిబ్రవరి 24న ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నారా లోకేశ్‌ నరసరావుపేట పర్యటనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి విమానాశ్రయం వద్దకు వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని... అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు. మరోవైపు టీడీపీ కీలక నేతలందరినీ పోలీసులు ఇప్పటికే గృహనిర్బంధం చేశారు. లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles