WhatsApp to allow users to hide online status soon వాట్సాప్ లాస్ట్ సీన్‌ ఆప్షన్ లో అదిరిపోయే ఫీచ‌ర్‌

Whatsapp may soon make a big change to the last seen feature

whatsapp, whatsapp latest news, whatsapp new features, upcoming features of whatsapp, whatsapp new features 2021, new features of whatsapp, new whatsapp features to be launched, disappearing mode, read later, mutli device support, whatsapp insurance, whatsapp logout, last seen, instagram reels, new whatsapp features in 2021, what are the new features of whatsapp

Facebook-owned WhatsApp will reportedly let users hide their online status from anyone who can't be trusted. As spotted by WABetaInfo, new privacy tools are in development to allow control over exactly who can see parts of a user's profile, reports Android Police.

వాట్సాప్ లో అదిరిపోయే ఫీచ‌ర్‌.. ఇకపై లాస్ట్ సీన్ అప్షన్లో మార్పులు

Posted: 09/07/2021 07:31 PM IST
Whatsapp may soon make a big change to the last seen feature

వాట్సాప్‌లో ఎన్నాళ్లుగానో యూజ‌ర్లు ఎదురుచూస్తున్న ఓ అదిరిపోయే ఫీచ‌ర్ త్వ‌ర‌లోనే రానుంది. ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్‌లో ఉన్న ఈ ఫీచ‌ర్‌.. అతి త్వ‌ర‌లోనే అంద‌రు యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానున్న‌ట్లు వాబీటాఇన్ఫో తెలిపింది. ఇన్నాళ్లూ మీ లాస్ట్ సీన్‌, ప్రొఫైల్ పిక్చర్‌, స్టేట‌స్ ల‌ను ఎవ‌రు చూడాల‌న్నదాంట్లో మూడు ఆప్ష‌న్సే అందుబాటులో ఉన్నాయ‌న్న విష‌యం తెలుసు క‌దా. ఎవ‌రీవ‌న్, మై కాంటాక్ట్స్‌, నోబ‌డీ అనే ఆప్ష‌న్స్ ఉన్నాయి. దీని ప్ర‌కారం ఎవ‌రీవ‌న్ అంటే ప్ర‌తి ఒక్క‌రూ మీ లాస్ట్ సీన్‌, ప్రొఫైల్ పిక్‌, స్టేట‌స్ చూడొచ్చు.

అదే మై కాంటాక్ట్స్ అంటే కేవ‌లం మీ కాంటాక్ట్స్ మాత్ర‌మే చూస్తారు. నోబ‌డీ అంటే ఎవ‌రూ చూడ‌లేరు. కానీ వాట్సాప్ తీసుకొస్తున్న తాజా అప్‌డేట్ ప్రకారం.. మీరు మీ కాంటాక్ట్స్‌లోని వాళ్ల‌లో కూడా కొంద‌రు మీ లాస్ట్ సీన్‌, ప్రొఫైల్ పిక్‌, స్టేట‌స్ చూడ‌కూడ‌ద‌నుకుంటే.. ఆ ప్ర‌కారం సెట్టింగ్స్ మార్చుకోవ‌చ్చు. ఈ కొత్త ఫీచ‌ర్ కోసం వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కీల‌క‌మైన మార్పులు చేస్తోంది. ఇప్ప‌టికే ఈ మార్పుల‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ బీటా వెర్ష‌న్‌ల‌లో టెస్ట్ కూడా చేశారు.

దీని ప్ర‌కారం ఇక నుంచి పైన ఉన్న మూడు ఆప్ష‌న్ల‌కు తోడు.. మ‌రో ఆప్ష‌న్ కూడా అందుబాటులోకి రానుంది. అది నా కాంటాక్టులకు తప్ప (మై కాంటాక్ట్స్ ఎక్స్ సెప్ట్). ఈ ఆప్ష‌న్ ఉప‌యోగించి.. మీ కాంటాక్ట్ ల‌లోనూ కొంద‌రు మీ లాస్ట్ సీన్‌, ప్రొఫైల్ పిక్‌, స్టేట‌స్ చూడ‌కుండా సెట్ చేసుకోవ‌చ్చు. ఈ ఆప్ష‌న్‌ను అతి త్వ‌ర‌లోనే వాట్సాప్ అంద‌రు యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు వాబీటాఇన్ఫో చెప్పింది. ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించి కాంటాక్ట్‌ల‌ను ఎలా యాడ్ చేయాల‌న్న‌ది ఇంకా తెలియ‌క‌పోయినా.. ఈ వాబీటాఇన్ఫో దానికి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్‌ను మాత్రం రిలీజ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles