BJP MLA protests with damru at Assembly భైథ్యనాథ్ ధామ్ కోసం బీజేజీ ఎమ్మెల్యే వినూత్న నిరసన..!

Bjp mla wields damru at assembly to demand reopening of baba baidyanath dham

deoghar, baba baidyanath dham, narayan das, BJP MLA, Protest with damru, jharkhand, Politics

BJP MLA Narayan Das arrived at the Jharkhand Assembly premises with a garland of leaves around his shoulder and a damru in his hands to demand that the temple be opened. He can be seen chanting 'Har Har Mahadev' with the group of people that accompanied him in a video.

ITEMVIDEOS: భైథ్యనాథ్ ధామ్ తెరవాలంటూ బీజేజీ ఎమ్మెల్యే వినూత్న నిరసన..

Posted: 09/07/2021 05:25 PM IST
Bjp mla wields damru at assembly to demand reopening of baba baidyanath dham

వైథ్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని తక్షణం తెరవాలని డిమాండ్ చేస్తూ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపి ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. జార్ఖండ్ రాష్ట్రం డియోగ‌ఢ్ నియోజ‌క‌వ‌ర్గంలోని బాబా వైథ్య‌నాథ్ ధామాన్ని తెరువాల‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నారాయ‌ణ దాస్‌ సహా పరిసర ప్రాంత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వినూత్న నిర‌స‌న చేప‌ట్టారు. నుదిటికి విభూది, మెడ‌లో ఉదారంగు వ‌స్త్రం, ఆకుప‌చ్చ‌ని ప్లాస్టిక్ ఆకుల‌ దండ, ఓ చేతిలో ఢ‌మ‌రుకం, మ‌రో చేతిలో క‌మండ‌లం ధ‌రించి అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఢ‌మ‌రుకం వాయిస్తూ నిర‌స‌న వ్యక్తం చేశారు. ఆయన వెంట ధియోగఢ్ పరిసర నియోజకవర్గాల బీజేపి ఎమ్మెల్యేలు కూడా ప్లాకర్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ దాస్ మీడియాతో మాట్లాడుతూ‌.. బాబా బైథ్య‌నాథ్ జ్యోతిర్లింగ్‌ ఆల‌యం కేవ‌లం డియోగ‌ఢ్‌లోనేగాక దేశంలోనే ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఆల‌య‌మ‌ని, వివిధ రాష్ట్రాల నుంచి భ‌క్తులు ఆల‌యానికి వ‌స్తుంటార‌ని చెప్పారు. అంతేగాక‌, ఆల‌యాన్ని తెరిస్తే ఎంతో మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని నారాయ‌ణ దాస్ తెలిపారు.

బాబా బైథ్యనాథ్ ఆల‌యాన్ని త‌క్ష‌ణ‌మే తెరువాల‌ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వాన్ని హెచ్చరించేందుకే తాను ఈ వేష‌ధార‌ణ‌లో అసెంబ్లీకి వ‌చ్చాన‌ని నారాయ‌ణ దాస్ చెప్పారు. లేదంటే అసెంబ్లీ స‌మావేశాలు ముగియ‌గానే డియోగ‌ఢ్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న నిర‌స‌న కొన‌సాగుతుంద‌ని హెచ్చ‌రించారు. ఇదిలావుంటే, బైథ్యనాథ్ ఆల‌యాన్ని తెరువాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచార‌ణ జ‌రిపింది. అయితే ఆ పిటిష‌న్‌పై అత్య‌వ‌స‌ర విచార‌ణ జ‌రుపాల‌న్న అభ్య‌ర్థ‌నను కోర్టు తిర‌స్క‌రించింది. అర్జంట్ లిస్టింగ్ నుంచి పిటిష‌న్‌ను త‌ప్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deoghar  baba baidyanath dham  narayan das  BJP MLA  Protest with damru  jharkhand  Politics  

Other Articles