ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా తమ కబంధహస్తాలలోకి తీసుకున్న తాలిబన్లకు ఇప్పటికే పంజ్‌షీర్ కొరకరాని కొయ్యగా మారిందనడంలో సందేహమే లేదు. అయితే ఈ లోయలోని ప్రావిన్సును కూడా స్వాధీనం చేసుకుని తమకు ఎదురులేదని తాలిబన్లు గత రెండు వారాలుగా చేస్తున్న ప్రయత్నాలకు పంజ్ షీర్ దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న విషయం తెలిసిందే. మొన్నటికిమొన్న ఏకంగా 350 మంది తాలిబన్ సేనలను పంజ్ షీర్ దళాలు మట్టుబెట్టాయి. అయితే తాజాగా ఈ లోయప్రాంత ప్రావిన్సుపై కూడా తాము పట్టు సాధించినట్లు తాలిబన్లు ప్రకటించారు. ఈ వార్తను రెబల్స్ ఖండిస్తున్నా.. అసలేం జరుగుతుందో మాత్రం తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
పంజ్ షీర్ ఎవరికీ దాహోసం కాకుండా చూస్తామని భీష్మించుకున్న రెబల్స్ మాత్రం భీకరంగా పోరాడుతున్నట్లు తెలుస్తోంది. పంజ్‌షీర్ లోయను స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు దూకుడును పెంచేశారు. అక్కడ హోరాహోరీగా రెండు వర్గాల మధ్య ఫైటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సోవియట్ దళాలకు కూడా చిక్కని పంజ్‌షీర్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నట్లు రాయటర్స్ సంస్థ పేర్కొన్నది. పంజ్‌షీర్ సేనలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాయి. పంజ్‌షీర్ నేత అమ్రుల్లా సలేహ్ తానెక్కడికి వెళ్లలేదన్నారు. కానీ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. పంజ్‌షీర్‌లో జరుగుతున్న ఫైటింగ్‌లో వందల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు కొన్ని వార్తలు వెలుబడుతున్నాయి.
కాబూల్‌కు ఉత్తరం దిక్కున ఉన్న పంజ్‌షీర్ లోయ ఓ ప్రత్యేక ప్రావిన్సు. ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని తాలిబన్లు వశం చేసుకోలేకపోయారు. కానీ రెండు వారాల నుంచి సాగుతున్న పోరు చివరి దశకు చేరుకుని తాలిబన్ల బలగాలు దానిని కూడా హస్తగతం చేసుకున్నాయి. ఈ క్రమంలో దేశం నుండి నిష్క్రమించిన తర్వాత సలేహ్ శుక్రవారం ఒక ట్వీట్ చేశారు. పంజ్‌షీర్ ప్రజల బాధాకరమైన అనుభవాలను ఆయన హైలైట్ చేశారు. ‘తాలిబ్‌లు పంజ్‌షీర్‌కి మానవతా సహాయాన్ని నిరోధించారు. పంజ్‌షీర్ సైనిక వృద్ధులను మైన్ క్లియరెన్స్‌కు వినియోగించుకున్నారు. ఫోన్, విద్యుత్ సౌకర్యాలను నిలిపివేశారు. ఔషధాలను కూడా అనుమతించడం లేదు. ప్రజలు కొంత మొత్తంలో మాత్రమే నగదు తీసుకెళ్లగలుగుతున్నారు’ అని పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో ఎమర్జెన్సీ ప్రారంభమైనప్పటి నుండి గత 23 సంవత్సరాలుగా తాలిబ్ యాక్సెస్ ని తాము ఎన్నడూ నిరోధించలేదని అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు. తాలిబ్ లు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని, ఐహెచ్‌ఎల్‌పై వారికి ఎలాంటి గౌరవం లేదని ఆరోపించారు. ఈ స్పష్టమైన నేరాలు, తీవ్రవాద ప్రవర్తనను గమనించాలని ఐరాస, ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నామని ట్వీట్ చేశారు. తాలిబన్లకు తాజాగా వశమైన ఆ లోయలో సుమారు రెండు లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. స్థానిక ట్రైబల్ లీడర్ అహ్మద్ మస్సౌద్ నేతృత్వంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పంజ్‌షీర్ దళాలు కదం తోక్కినా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more