JD(U) MLA Gopal Mandal seen in underwear on train బట్టలు విప్పేసి తిరిగిన జేడీయూ ఎమ్మెల్యే.. విమర్శల వెల్లువ

Netaji in underwear bihar jd u mla gopal mandal seen in underwear on train

Tejas Rajdhani Express, Bihar JDU MLA Gopal Mandal, MLA Gopal mandal caught in Underwear, netaji in underwear, bihar mla, Gopal Mandal, JDU MLA, Tejas Rajdhani Express, Nitish Kumar, AC First Class, Patna-New Delhi, Bihar, Politics

An MLA of Bihar Chief Minister Nitish Kumar's party was reported by his fellow passengers on a train journey for walking around in his underwear. JDU MLA Gopal Mandal is seen in his underwear in the AC First Class compartment of Tejas Rajdhani Express, on a journey from Patna to New Delhi.

బట్టలు విప్పేసి తిరిగిన జేడీయూ ఎమ్మెల్యే.. విమర్శల వెల్లువ

Posted: 09/03/2021 06:43 PM IST
Netaji in underwear bihar jd u mla gopal mandal seen in underwear on train

ఆయన ఓ ప్రజాప్రతినిధి. ఏకంగా చట్టసభకు ఎన్నికైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎక్కడ ఎలా నడుచుకోవాలో కూడా తెలిసివుండాలి. అంతేకాదు.. ఈ విషయాన్ని పదిమందికి చెప్పి వారిని కూడా సన్మార్గంలో నడిపించేలా చూడాలి. అలా కాకుండా తాను ఎమ్మెల్యేను.. తనకు ఎవరు ఎదురు చెప్పకూడదన్న భావన వ్యవహరిస్తే అబాసుపాలు కావడం కామన్. ఇప్పుడీ బీహార్ కు చెందిన ఎమ్మెల్యేకు అదే జరిగింది. జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండ‌ల్ వివాదంలో ఇరుక్కున్నారు. తేజ‌స్ రైలులో ప్ర‌యాణించిన ఆయ‌న‌.. తోటి ప్ర‌యాణికుల‌తో ఇబ్బందిక‌ర రీతిలో ప్ర‌వ‌ర్తించారు. పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజ‌స్ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ రైలులోని సెకండ్ ఏసీ కోచ్‌లో ఆయ‌న బ‌నియ‌న్‌, అండ‌ర్‌వేర్‌లో అటూ ఇటూ తిరిగారు.

దీనిపై ఆ కోచ్‌లో ఉన్న ప్ర‌యాణికులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. యూపీలోని దిల్‌దార్ న‌గ‌ర్ జంక్ష‌న్ వ‌ద్ద .. లోదుస్తుల్లో ఉన్న ఎమ్మెల్యేకు.. ఆ కోచ్‌లో ఉన్న ఇత‌ర ప్యాసింజెర్ల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు ఆయ‌న ఇత‌ర ప్యాసింజెర్ల ముందే బ‌ట్టలు విప్పేశారు. అయితే ఎమ్మెల్యే గోపాల్ వ్య‌వ‌హార శైలిని ప్ర‌హ్లాద్ పాశ్వాన్ అనే వ్య‌క్తి ఖండించారు. ఫ్యామిలీ ముందు ఇలా బ‌ట్ట‌లు విప్ప‌డం స‌రికాదు అని ఆ ఎమ్మెల్యేతో అత‌ను వాదించాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య మాట‌ల ఘ‌ర్ష‌ణ మొద‌లైంది. ఓ ద‌శ‌లో ఆర్పీఎఫ్ పోలీసులు వ‌చ్చి ఆ గొడ‌వను ఆపే ప్ర‌య‌త్నం చేశారు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేర‌డంతో తేజ‌స్ రైలును దిల్‌దార్‌న‌గ‌ర్ జంక్ష‌న్‌లో నిలిపేశారు.

రైలులో లోదుస్తుల్లో వాష్ రూమ్ కు ప‌రుగెత్తిన ఘ‌ట‌న గురించి ఎమ్మెల్యే గోపాల్ రియాక్ట్ అయ్యారు. త‌న క‌డుపు గ‌డ‌బిడ పెట్ట‌డం వ‌ల్లే తాను తొంద‌ర‌లో అండ‌ర్‌గార్మెంట్స్‌తో ప‌రుగుపెట్టిన‌ట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. రైలు ఎక్కిన వెంట‌నే.. మ‌రుగుదొడ్డికి వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందని, త‌క్ష‌ణ‌మే కుర్తా పైజామా విప్పేసి.. భుజంపై ట‌వ‌ల్ వేసుకుని శౌచాల‌యానికి వెళ్లాల‌న‌న్నారు. ట‌వ‌ల్‌ను త‌న న‌డుముకు చుట్టుకునే టైమ్ లేద‌ని ఎమ్మెల్యే అన్నారు. ఈ సంఘ‌ట‌న‌ను ఆయ‌న వివ‌రిస్తూ.. మ‌రుగుదొడ్డికి వెళ్తున‌ప్పుడు ఓ వ్య‌క్తి న‌న్ను అడ్డుకున్నాడ‌ని, న‌గ్నంగా ఎక్క‌డికి వెళ్తున్నావ‌ని అడిగార‌ని, చేయిని ప‌ట్టుకుని అత‌నే న‌న్ను డిస్ట‌ర్బ్ చేశాడ‌ని, అయినా తాను తొంద‌ర‌గా టాయిలెట్‌కు వెళ్లిన‌ట్లు ఎమ్మెల్యే తెలిపారు. మ‌రుగుదొడ్డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆ వ్య‌క్తి వివ‌రాలు తెలుసుకున్న‌ట్లు ఎమ్మెల్యే చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles