వడ పావ్.. భారతదేశంలో అత్యధిక ప్రజలకు ఇష్టమైన, రుచికరమైన చిరుతిండి ఏదీ అంటే అదే వడా పావ్. చిన్నారులు చాట్ లలో వడా పావ్ ను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొందరు వడను శెనగపిండితో చేస్తే.. ఇంకొందరు ఆలుగడ్డలతో కూడా తయారు చేస్తుంటారు. దీనికి పావ్ జోడించి నెయ్యి, చాట్ మసాలా వేసి వేయిస్తే.. దాని రుచికి రాదు ఏదీ సాటి. అందుకే పిల్లలు ఎక్కువగా తింటారు. అయితే, మన వద్ద సాధారణ వడ పావ్ మాత్రమే దొరుకుతుంది. కానీ, ఇప్పుడు బంగారు వడ పావ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎక్కడంటే..
మొన్న బంగారం బిర్యానీని.. నిన్న బంగారం ఐస్‌క్రీమ్‌ను వడ్డించిన దుబాయ్‌లో.. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్‌లో బంగారు వడ పావ్ కూడా దొరుకుతున్నది. 22 క్యారెట్ల బంగారం పూతతో వడ పావ్‌ను కస్టమర్లకు అందిస్తూ తమ వ్యాపారాన్ని బంగారుమయంగా చేసుకుంటున్నారు. వడ పావ్‌ను అందరి మాదిరిగా సింపుల్‌గా ఇస్తే ఏం స్పెషల్ ఉంటుందని ఆలోచించిన ఓ సంస్థ.. బంగారం వడ పావ్‌ను వేడివేడిగా వడ్డిస్తున్నది. ఇదే ప్రపంచంలో తొలి 22 క్యారెట్ బంగారం పూతతో చేసిన వడ పావ్‌గా కూడా గుర్తింపు పొందింది.
అల్ కరామాలో ఉన్న ఓ పావో అనే రెస్టారెంట్ భారతీయ వంటకాలను అందించడానికి ప్రసిద్ధి చెందింది. వెన్న, చీజ్‌తో తయారు చేసి వేయించిన తర్వాత వాటిని తినేందుకు వీలున్న 22 క్యారెట్ గోల్డ్ రేకుతో కప్పి వడ్డిస్తున్నారు. నోరూరించే ఈ గోల్డెన్ వడ పావ్ ధర కూడా అందుబాటులోనే ఉంచారు. దీని ఖరీదు 100 అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్‌లు (దాదాపు రూ.2,000) గా నిర్ణయించారు. ఈ గోల్డెన్ వడ పావ్ ను డైన్-ఇన్ ఎంపికకు మాత్రమే అందుబాటులో ఉంచారు.
#Gold_Vada_Paav This is what's wrong with the world: too many rebels without a cause. pic.twitter.com/JKeKsgOLEo
— Masarat Daud (@masarat) August 30, 2021
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more