చుట్టూర సముద్రం.. చిన్న పడవలో అలా విహారం చేస్తున్న సముద్ర ఔత్సాహికులు. ఈ క్రమంలో సముద్రంలోని ప్రమాదకర జీవులు వారికి తారసపడితే.. కిమ్మనకుండా ఉంటారు. ఏ మాత్రం అలికిడి చేసినా అవి వారిని గుర్తించి ముప్పు తలపెట్టే ప్రమాదం పోంచివుంటుంది. అయితే ఇలానే వెళ్లిన సముద్ర ఔత్సాహికుడికి ఏకంగా పెద్ద సముద్రపు పాము కనిపించింది. వామ్మో పాము అని దానిని చూస్తూండగానే అది ఎక్కడి నుంచో ఈ నాటు పడవను పసిగట్టంది. దాని వైపే అలా వేగంగా దూసుకువచ్చింది. ఈ స్థానంలో ఎవరైనా వుంటే పడవను దిగలేరు.. అలా అని పాము రాకను చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిందే.
సముద్రంలో పడవ దిగినా.. పాము కాటేసినా ప్రమాదమే. దీంతో భయంతో బిక్కచచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కానీ ఈ సముద్ర ఔత్సాహికుడు.. యూట్యూబర్ మాత్రం తన వెంట పడిన పామును వీడియో తీశాడు. పడవేసుకొని సముద్రంలోకి వెళ్లిన సమయంలో నీటి నుంచి బయటకు వచ్చిన ఈ పాము.. అతని వెంట పడింది. ఎంతలా అంటే పడవ వెళ్తున్న వేగాన్ని చట్టుక్కున అందుకుంది. అలా వేగంగా వచ్చిన పాము పడవలోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించి.. ఒక్క క్షణం ఆ పడవపై తల పెట్టి, ఏదో సంశయంతో తాను వెతుకుతున్నది దీని కోసం కాదు అని వెనుతిరిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత నీటిలోపలకు వెళ్లి మాయమైంది.
టిక్ టాక్ లో బ్రాడీ మోస్ అనే అస్ట్రేలియా దేశానికి చెందిన ఫిల్మ్ మేకర్, యూట్యూబర్, సముద్ర ఔత్సాహికుడు షేర్ చేసిన ఈ వీడియో ఇతర సోషల్ మీడియా వేదికలకు కూడా పాకింది. సాధారణంగా నీటి పాములు మనుషుల జోలికి రావని ఈ వీడియోలో బ్రాడీ చెప్పడం వినిపిస్తుంది. కానీ ఏడాదిలో ఈ సమయంలో మాత్రం అవి జత కోసం వెతుకులాడుతూ ఉంటాయట. చాలా చిరాకు పడుతూ ఉండటంతోనే అది తనను వెంబడించిందని బ్రాడీ వివరించాడు. ట్విట్టర్లో కూడా ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూసిన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more