Snake venom may be tool to fight COVID-19 -study కరోనాకు అంతం పలికే దివ్యౌషదం.. ఈ విషసర్పమందు లభ్యం..!

Jararacussu pit viper found in brazil can be the answer to coronavirus says study

Coronavirus, COVID 19, Jararacussu Pit snake, Monkeys, scientific journal, Molecules, covid-19, Jararacussu pit viper, Giuseppe Puorto, herpetologist, Butantan Institute's biological collection, Sao Paulo, Brazil

Scientists have found a way to fight the coronavirus at an early stage. A group of researchers in Brazil has discovered that the venom of a snake found in the country can be a solution to the problems related to Covid 19. A study published in the scientific journal Molecules states that the molecule produced by the jararacussu pit viper inhibited the virus's ability to multiply in monkey cells by 75%.

కరోనాకు అంతం పలికే దివ్యౌషదం.. ఈ విషసర్పమందు లభ్యం..!

Posted: 09/01/2021 08:38 PM IST
Jararacussu pit viper found in brazil can be the answer to coronavirus says study

విషతుల్యంగా మారి మనుషుల శరీరాల్లోకి మరీ ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకి చేరి వాటిని కబళించేసి.. ప్రాణాలనే హరించే కరోనావైరస్ మహమ్మారిపై యుద్దానికి మరో దివ్యాస్త్రాం లభించింది. ఔనా ఎంత చక్కటి వార్తను చెప్పారు అంటున్నారుగా, ఇంతకీ ఆ అస్త్రం ఏక్కడ లభిస్తోందని అంటే.. ఓ దేశంలో లభించే అత్యంత ప్రమాదకరమైన విష స‌ర్ప‌ంలోనే ఈ అస్త్రం ఉంటుంది. ఈ విష సర్పం జోలికి వెళ్తే అదే ప్రాణాలను హరిస్తుంది కదా.. ఇలా ఇరుకిస్తారేంటీ అంటారా.? అయితే పోరబడ్డారు.. కోవిడ్-‌19 నివార‌ణ‌లో బ్రెజిల్ అడ‌వుల్లో క‌నిపించే స‌ర్పం జ‌రారాకుసో పిట్ వైపర్ అనే విషపూరిత సర్పం అత్యంత కీలకం కానుంది.

ఈ జరారాకుసో పిట్ వైపర్ కు చెందిన విషంతో కోవిడ్‌19ను అంతం చేయ‌వ‌చ్చు అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్య‌య‌న నివేదిక‌ను సైంటిఫిక్ జ‌ర్న‌ల్ మాలిక్యూల్స్‌లో ప్ర‌చురించారు. ర‌క్త‌పింజ‌ర జ‌రారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆ స‌ర్ప విష అణువులు కోతుల్లో 75 శాతం క‌రోనా వైర‌స్ క‌ణాల వృద్ధిని నియంత్రిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాణాంత‌కంగా మారుతున్న కోవిడ్ వ్యాధి నివార‌ణ‌లో వైప‌ర్ స్నేక్ జ‌రారాకుసో విషంలో ఉన్న అణువులు కీల‌కం కానున్న‌ట్లు భావిస్తున్నారు. సావో పౌలో యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ రాఫేల్ గైడో దీనికి సంబంధించిన వివ‌ర‌ణ ఇచ్చారు.

వైర‌స్‌లో రెట్టింపు అవుతున్న ముఖ్య‌మైన ప్రోటీన్‌ను అడ్డుకోవ‌డంలో జ‌రారాకుసో స‌ర్పంలో ఉన్న అణువులు ప‌నిచేస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. బ్రెజిల్‌లో క‌నిపించే అతిపెద్ద స‌ర్పంగా జ‌రారాకుసోకు గుర్తింపు ఉన్న‌ది. ఆ పాములు సుమారు రెండు మీట‌ర్ల పొడుగు ఉంటాయి. అట్లాంటిక్ తీర ప్రాంత అడ‌వుల‌తో పాటు బొలివియా, ప‌రాగ్వే, అర్జెంటీనా దేశాల్లో ఈ స‌ర్పాలు సంచ‌రిస్తుంటాయి. ఆ స‌ర్పాల్లో ఉండే పెప్ టైడ్ అణువుల‌ను ల్యాబ్ ల్లోనూ అభివృద్ధి చేయ‌వ‌చ్చు అని రాఫేల్ గైడో తెలిపారు. ప్ర‌స్తుతం శాస్త్ర‌వేత్త‌లు ఇంకా అధ్య‌య‌న ద‌శ‌లోనే ఉన్నారు. ఈ అధ్యయనం త్వరగా పూర్తైన తరువాత నివేదికలో విషయాలు బయటకు వస్తే ఇక వాక్సీన్లు, మందులతో పనిలేకుండా జరారాకుసో అణువులతో కరోనాకు చెక్ చెప్పయ్యవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles