Etela Rajender dares CM KCR, Minister Harish Rao సీఎం కేసీఆర్, హరీశ్ రావులకు ఈటెల సవాల్..

Etela rajender dares kcr harish rao to contest in huzurabad against him

Etela Rajender, Gellu Srinivas, BJP, TRS, Harish Rao, CM KCR, Dalit Bandhu, Congress, Padi Kaushik Reddy, Huzurabad, etela rajender challenges Harish Rao, etela rajender challenges CM KCR, etela rajender trs, etela rajender mla, etela rajender new party, etela rajender news latest, etela rajender updates, Etela Rajender resigns from TRS, Etela Rajender to join BJP, Telangana minister, Jamuna Hatcheries, Hyderabad, Telangana, Politics

Expelled Minister and BJP Leader Etela Rajender dares KCR, Harish Rao to contest in Huzurabad against him, inspite of dalit bandhu and other governmnet schemes induced in the constitutency. He also challenges to win in elections so that he will walk out of politics.

అదే జరిగితే రాజకీయ సన్యాసం: సీఎం కేసీఆర్, హరీశ్ రావులకు ఈటెల సవాల్..

Posted: 09/01/2021 04:13 PM IST
Etela rajender dares kcr harish rao to contest in huzurabad against him

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నికలలో గెలుపు కోసం వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధానాన్ని ఖర్చుపెడుతున్నారని అన్నారు. దళితబంధు పథకాన్ని హుజురాబాద్ ఉపఎన్నికల కోసమే తీసుకువచ్చారని అరోపించారు. రాష్ట్రంలో ఏ పథకమైనా ఇప్పటి వరకు ఓ జిల్లాకో, ఓక నియోజకవర్గానికో పరిమితం కాలేదని.. కానీ దళితబంధు మాత్రం అందుకనే అధికార పార్టీ తీసుకువచ్చిందని దుయ్యటట్టారు. ఎన్ని వేల కోట్లు ఖర్చుపెట్టినా హుజూరాబాద్ ప్రజల ఆధరాబిమానాలు పోందిన తానే గెలుస్తానని అన్నారు.

గత రాత్రి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్‌లో నిర్వహించిన సమావేశంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు ఓ సవాల్ విసిరారు. దళితబంధు పథకంతో పాటు వందల కోట్లు రూపాయలతో వేస్తున్న రోడ్లు, అడిగినవారికి అడిగినట్టుగా వ్యక్తిగత అవసరాలను కూడా తీరుస్తున్న అధికార పార్టీ నేతలు అండ మీకుంటే.. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేసి గెలవాలని ఆయన ఛాలెంజ్ చేశారు. తనపై నిలబడి మీరు గెలుస్తారన్న నమ్మకం వుంటే మీరే నిలబడాలని అన్నారు. వారికి నమ్మకం లేదని ఈటెల అన్నారు. వారు పోటీ చేసి గెలిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, దమ్ముంటే తనతో పోటీకి దిగాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు సవాలు విసిరారు. అదే వారు కనుక ఓడిపోతే రాజీనామా చేయాలని అన్నారు.

తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నానని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాటిముందు ఫలించవని అన్నారు. బెదిరింపులు, అహంకారం, డబ్బులతో హుజూరాబాద్‌లో పరిస్థితిని అటుదిటు మార్చడం కేసీఆర్ జేజమ్మ తరం కూడా కాదన్నారు. బక్కపల్చగా ఉన్న ఈటల అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడని, ధర్మం కోసం, న్యాయం కోసం దేన్నైనా త్యాగం చేసే సత్తా ఉన్నోడని ఈటల అన్నారు. ధర్మంతో పెట్టుకున్న కేసీఆర్‌ కు పతనం తప్పదని హెచ్చరించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని, రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఇదేనని అన్నారు. కేసీఆర్‌తో తనకు 18 సంవత్సరాల అనుబంధం ఉందని, కాబట్టే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రాజీనామా చేయమంటే ముఖం మీద కొట్టి వచ్చానని ఈటల పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles