Adivasi man dies after being dragged by a truck సర్పంచ్ భర్త అటవిక న్యాయం.. అదివాసీ మృతి

Mp houses of those accused of killing adivasi man demolished

MP local body demolishes homes of accused, MP Neemuch administration, house demolition, eight accused drag tribal man on road, MP tribal man dragged on streets, Mahendra Gurjar, Gopal Gurjar, Lokesh Balai, Laxman Gurjar, adivasi man, Kanhaiyalal Bheel, milk vendor, Chhitar Mal Gurjar, houses demolished, local bodies, Neemuch district, Madhya Pradesh, Crime

The illegally constructed houses of three men accused of torturing and killing a 45-year-old Adivasi man in Madhya Pradesh were demolished by the local administration. The man died in Neemuch district of the state after he was tied to a truck that dragged him through the streets.

ITEMVIDEOS: వైరల్ వీడియో: సర్పంచ్ భర్త అటవిక న్యాయం.. అదివాసీ మృతి

Posted: 08/30/2021 05:06 PM IST
Mp houses of those accused of killing adivasi man demolished

ఓ గ్రామ సర్పంచ్ భర్త.. తన బంధువుకు వకాల్తా పుచ్చుకుని అమాయక అదివాసి ప్రాణాన్ని బలిగొన్నాడు. ఊరికి పెద్ద కావడంతో తాను చట్టానికి అతీతం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఏకపక్ష నిర్ణయం తీసుకుని అదివాసి పట్ల అటవిక శిక్షకు పూనుకున్నాడు. అతని కాళ్లను తాడుతో లారీకి కట్టి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ పాశవిక ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించాడు. మధ్యప్రదేశ్ లోని నీమూచ్ జిల్లా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, అమాయక అదివాసి మరణంపై స్పందించిన స్థానిక అధికారులు ఈ ఘటనతో ప్రమేయమున్న ముగ్గురి ఇళ్లను నిబంధనలకు విరుద్దంగా వున్నాయని కూల్చివేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కన్హయ్య లాల్ భీల్ (45) అనే వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా.. చిత్తర్మల్ గుర్జర్ అనే పాల వ్యాపారి బైకుపై వచ్చి ఢీకొట్టాడు. ఇద్దరూ కిందపడిపోయారు. అయితే, పాలు మొత్తం ఒలిగిపోవడంతో కన్హయ్యపై చిత్తర్మల్ దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులతో పాటు గ్రామ సర్పంచ్ భర్త మహింధ్ర గుజ్జర్ ను కూడా పిలిపించి కొట్టించాడు. ఆ తర్వాత బాధితుడి కాలిని తాడుతో ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లారు. ఒక నిందితుడు అతడి మొహంపై తన్నాడు. బాధతో విలవిల్లాడుతూ అతడు వేడుకున్నా వినలేదు. ఒళ్లంతా రోడ్డుకి రాసుకుపోయి కన్హయ్యకు తీవ్రగాయాలయ్యాయి.

ఆ ఘటనను చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారు అక్కడికి వచ్చే లోపు నిందితులు పారిపోయారు. తీవ్రగాయాలపాలైన భీల్ ను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. 8 మంది ఈ దారుణానికి పాల్పడ్డారని నీమూచ్ జిల్లా ఎస్పీ సూరజ్ కుమార్ వర్మ చెప్పారు. చిత్తర్మల్ తో పాటు మహేంద్ర గుర్జర్, గోపాల్ గుర్జర్, లోకేశ్ బాలాయి, లక్ష్మణ్ గుర్జర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్హయ్యపై దొంగ అనే ముద్ర వేసేందుకు వారు ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. కాగా స్థానిక అధికారులు ఎనమిది మందిలో ముగ్గురు నిందితుల ఇళ్లు నిబంధనలకు విరుద్దంగా వున్నాయని వాటిని కూల్చివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles