woman paraded naked in telangana మహిళను వివస్త్రను చేసి.. కళ్లలో కారం చల్లి.. వీధుల్లో తిప్పి.. దాడి

Murder accused woman beaten stripped and paraded naked in suryapet of telangana

woman stripped, woman paraded naked, women beaten, assault on woman, harrasment on women, suryapet woman, rajunaik thanda, suryapet, Telangana, crime

A woman allegedly accused in Murder case of a person from Rajunaik Thanda of suryapet district and mandal, was stripped naked, beaten, and then paraded naked in the streets of Thanda.

మహిళను వివస్త్రను చేసి.. కళ్లలో కారం చల్లి.. వీధుల్లో తిప్పి.. దాడి

Posted: 08/30/2021 12:15 PM IST
Murder accused woman beaten stripped and paraded naked in suryapet of telangana

తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో అగ్రగామిగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో దళితులు కూడా ఆర్థికంగా సుస్థిరపడేందుకు రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఓ వైపు ప్రభుత్వం ఇంతలా చర్యలు చేపడుతున్నా.. దళితుల్లో మాత్రం ఇంకా అనాగరిక చర్యలు కోనసాగుతున్నాయి. ఆటవిక న్యాయం మాటున ఓ మహిళపై అత్యంత దారుణం జరిగింది. ఓ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై పాశవిక దాడి జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగా అమె కళ్లలో కారం చల్లి, అమెను వివస్త్రను చేసి.. అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని అదే మండలం పరిధిలోని రాజునాయక్ తండాకు చెందిన శంకర్‌నాయక్ జూన్ 13న హత్యకు గురయ్యాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అదే ఊరికి చెందిన మహిళను అరెస్ట్ చేశారు. ఇటీవల ఆమె బెయిలుపై విడుదలై గ్రామానికి వచ్చింది. హత్యకు గురైన శంకర్‌నాయక్ బంధువులతో ఆమెకు పాతకక్షలు ఉండడంతో ఆమె తన సోదరి ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో తండాలో బంధువు ఒకరు మృతి చెందడంతో శనివారం అక్కడికి వెళ్లింది. ఆమెను అక్కడ చూసి కోపంతో ఊగిపోయిన శంకర్‌నాయక్ బంధువులు ఆమెను పట్టుకుని దాడిచేశారు. ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. ఆపై కళ్లలో కారంపోసి, కర్రలతో కొడుతూ నగ్నంగా వీధుల్లో తిప్పారు.

ఇలా నడివీధిలో ఓ మహిళను వివస్త్రను చేసి ఆమెపై ఏకంగా గంటపాటు పాశవికంగా దాడి చేస్తున్నా.. అక్కడున్నవారు కళ్లప్పగించి చూశారే తప్పితే ఒక్కరు కూడా అడ్డుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న మహిళ ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి పరుగులు తీసింది. శాంతాబాయి ఆమె ఒంటిపై దుస్తులు కప్పి రక్షణ కల్పించింది. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని, బాధిత మహిళను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles