Karvy Parthasarathy to police custody again కార్వీ స్కాం: పార్ధ‌సార‌ధికి మ‌ళ్లీ రెండ్రోజుల పోలీసు క‌స్ట‌డీ.. !

Hyderabad cops get two day custody of karvy cmd parthasarathy again

parthasarathy, cmd c parthasarathy, ksbl, Hyderabad cop, cyberabad, Karvy Stock Broking Ltd (KSBL), ICICI bank, Crime

Again Nampally Criminal Court granted custodial interrogation of Karvy Stock Broking Ltd (KSBL) chairman and MD C Parthasarathy, Hyderabad Central Crime Station (CCS) police on Saturday took him into custody. Parthasarathy will be in police custody for two days.

పార్ధ‌సార‌ధికి మ‌ళ్లీ రెండ్రోజుల క‌స్ట‌డీ.. కార్వీ స్కాం విలువ రూ.2700 కోట్లా.?

Posted: 08/28/2021 09:00 PM IST
Hyderabad cops get two day custody of karvy cmd parthasarathy again

ప్రముఖ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సంస్థ కార్వీలో కుంభ‌కోణం గుట్టును హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు వెలికి తీశారు. ఈ కుంభ‌కోణం మొత్తం విలువ రూ.2700 కోట్లు అని నిగ్గు తేల్చారు. స‌కాలంలో రుణాలు చెల్లించ‌కుండా ఎగ‌వేత‌కు పాల్ప‌డిన కార్వీ చైర్మ‌న్ పార్ధ‌సార‌ధిపై బ్యాంకుల ఫిర్యాదు మేర‌కు హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల వినతిని పరిశీలించిన న్యాయస్థానం గత బుధవారం రెండు రోజుల క‌స్ట‌డీ అప్పగించిన విషయం తెలిసిందే.

ఈ గడువు నిన్నటితో ముగిసిపోవ‌డంతో శ‌నివారం మ‌రోమారు క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని పోలీసులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈసారి రెండు రోజుల క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ నాంప‌ల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆది, సోమ‌వారాల్లో మ‌రోమారు పార్ధ‌సార‌ధిని పోలీసులు విచారిస్తారు. ఇప్ప‌టికే జ‌రిగిన విచార‌ణ‌లో పార్థ సార‌ధి నుంచి కీల‌క ఆధారాల‌ను పోలీసులు సేక‌రించారు. క‌స్ట‌మ‌ర్ల షేర్ల‌ను కంపెనీ షేర్లుగా చూపిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ.. బ్యాంకుల నుంచి రుణాలు పొందింది. రూ.780 కోట్ల విలువైన షేర్ల‌ను కొనుగోలు చేసిన‌ట్లు పార్ధ‌సార‌ధి చెప్పారు. ఆస్తులు అమ్మైనా క‌స్ట‌మ‌ర్ల అప్పులు తీరుస్తాన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా, పీటీ వారెంట్‌పై ఆయ‌న‌ను తీసుకెళ్లి విచారించేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles