Parrot's 'fantastic trip' with a phone in viral video రోబో 2.0: ఫోన్‌ను ఎత్తుకెళ్లిన రామచిలుక.. ఏం చేసిందంటే.?

Video of parrot flying away with a phone has netizens scratching their heads

parrot flying away with phone viral video, parrot, parrot viral video, bird flying with phone trending, Parrot mobile phone, parrot video shoot, parrot trip, Trending, Viral Video, Parrot flies with phone, Trending Video

In a recent video, a parrot is seen grabbing a phone and flying away with it. The video has been shared by a Twitter user called Fred Schultz. In this video of two minutes, the man who posted the video is also featured. Sharing the viral video on Twitter, Fred wrote a caption, "Parrot takes the phone on a fantastic trip".

ITEMVIDEOS: రోబో 2.0: ఫోన్‌ను ఎత్తుకెళ్లిన చిలుక.. ఏం చేసిందో తెలుసా.?

Posted: 08/26/2021 08:17 PM IST
Video of parrot flying away with a phone has netizens scratching their heads

పక్షులు ఎగురుతున్నప్పుడు వాటికి నేలపై ఉన్న వస్తువులు, మనుషులు, ఆహారం ఎలా కనిసిస్తాయి. పక్షిలా వీక్షణం చేయడం మనకు సాథ్యమేనా అంటే ఇప్పుడు ఆ కోరిక తీర్చేందుకు డ్రోన్లు వచ్చాయి. ఇ:ట్లో పెంచుకునే రామచిలుక మన ఫోన్ ను ఎత్తుకెళ్లి.. వీడియో తీస్తే ఎలా ఉంటుంది. అదికూడా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఫోన్ తో వీడియో షూట్ చేస్తే ఎలా ఉంట‌ుందీ. అలా ఎలా జరుగుతుంది అంటారా.. కానీ అదే జరిగింది. ఓ రామచిలుక ఫోన్ తో తీసిన వీడియో తీసింది. అయితే వీడియో ఏమాత్రం షేక్ అవ్వలేదు సరకదా ఫుల్ క్లారిటీగా ఉంది. పైగా వీడియో తీసే రామచిలుక కూడా ఈ వీడియోలో కనిపించటం మరో విశేషం.

ఓ వ్యక్తి ఇంటి మేడపై నిల్చుని తన ఫోన్ లో ఏవో చూసుకుంటున్నాడు ఇంటి బయట నిలబడి. సడెన్ గా ఓ రామచిలుక ఎక్కడి నుంచి వచ్చిందో గానీ మొత్తానికి అతని ఫోన్ ను ఎత్తుకెళ్లింది. దాంతో అతని దిమ్మ తిరిగిపోయింది. కానీ క్షణాల్లో ఆ రామచిలుక అరుచుకుంటూ ఫోన్ తో సహా ఎగిరిపోయింది. అలా ఫోన్ దొంగిలించి ఎగురుకుంటూ వెళ్తుండ‌గా.. ఆ ఫోన్ కెమెరా ఆన్ అయింది. దీంతో వీడియో రికార్డు అయింది. ఓ వ్య‌క్తి ఫోన్‌ను లాక్కెళ్లిన రామ‌చిలుక దాన్ని కాలి గోళ్ల‌తో ఫోన్‌ను ప‌ట్టుకుంది. అదే స‌మ‌యంలో.. ఫోన్ కెమెరా ఆన్ అయి రికార్డ‌వ‌డం స్టార్ట్ అయింది. ఇక అది ఎగురుకుంటూ కొంచెం దూరం రోడ్డు గుండా మళ్లీ ఇళ్ల మీద నుంచి అలా వెళ్తూ ఉంది.

అలా వెళ్లీ వెళ్లీ..అటు తిరిగి ఇటు తిరిగి చివ‌ర‌కు ఓ కారు మీద ఆగింది. అప్పుడు గానీ ఆ ఫోన్ రికార్డింగ్ ఆగ‌లేదు. అలా చిలుక ట్రిప్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. డ్రోన్ తో తీసిన వీడియోకు కూడా ఇంత క్లారిటీ ఉండదేమో అన్నట్లుగా భలే తీసింది రామచిలుక వీడియోని.సూప‌ర్బ్‌.. ప‌క్షుల పైన ఎగురుతూ వెళ్తుంటే.. కింద వ్యూ అలా ఉంటుందా? అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో కొంరదు ఇది పూర్తిగా యానిమేటెడ్ వీడియో అనడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిలుక ఎత్తుకెళ్లిన ఫోన్ యాజమానికి ఎలా చేరిందని మరికొందరు అనుమానం వ్యక్తం చే్స్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles