Set back to Union Minister Pashupati Paras in Bihar సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి పశుపతి పరాస్ కు పరాభవం..

Ink thrown at union minister pashupati paras in his constituency hajipur

Pashupati Paras, ink thrown at Pashupati Paras, ink thrown at Union Minister Pashupati Paras, Lok Sabha constiuency, Pashupati Paras Hajipur, Bihar, Politics

Union Minister Pashupati Kumar Paras visited his Lok Sabha constituency Hajipur for the first time after being inducted into Prime Minister Narendra Modi's cabinet. But as soon as the Lok Janshakti Party (LJP) MP's convoy reached Hajipur, a female supporter of Chirag Paswan threw ink on the union minister, sources said.

సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి పశుపతి పరాస్ కు పరాభవం..

Posted: 08/24/2021 10:38 AM IST
Ink thrown at union minister pashupati paras in his constituency hajipur

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తన సోంత నియోజకవర్గంలో తొలిసారిగా పర్యటిస్తున్న కేంద్రమంత్రి పశుపతి పరాస్ కు పరాభవం ఎదురైంది. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీలిక నేత పశుపతి పరాస్.. ఇటీవల కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్రమంత్రి హోదాలో తొలిసారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బిహార్ రాష్ట్రంలోని హాజీపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఆయన వచ్చారు. ఈ క్రమంలో ఓ మహిళ ఆయనపై సిరాతో (ఇంకుతో) దాడి చేసింది.

హాజీపూర్ చేరుకున్న మంత్రి ఆయన అనుచర వర్గం ఘనస్వాగతం పలికింది. కాగా ఆయన వ్యతిరేక వర్గం మాత్రం అడుగడుగునా ఆయన నిరసన తెలిపింది. రాం విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్ కు బలమైన అనుచరగణం ఆయనను ప్రతీ చోటా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చిరాగ్ పాశ్వాన్ మద్దతురాలు అయిన మహిళ పశుపతి పరాస్ పై ఇంకు చల్లింది. దీంతో ఆయన ధరించిన కుర్తాపై ఇంకు మరకలు పడ్డాయి. కాసేపటి తర్వాత మంత్రి తన దుస్తులు మార్చుకున్న ఆయనకు నియోజకవర్గంలో నిరసనల మధ్య యథావిధిగా తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 
లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన రాం విలాస్ పాశ్వాన్ చిన్న తమ్ముడైన పశుపతి పరాస్.. తన సోదరుడు పార్టీ స్థాపించిన క్రమంలో అడుగడుగునా అండగా నిలిచారు. అయితే రాం విలాస్ మరణం తరువాత మారిన పరిణామాల నేపథ్యంలో పార్టీ బాధ్యతలు ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ అందుకన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన పరాస్.. ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి పార్టీకి తాను అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఆయనకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది కానీ సోంత నియోజకవర్గంలో మాత్రం నిరసన ఎదురైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles