Jewellers plan token stir against Hallmarking 23న జ్యూవెలరీ అసోసియేషన్ సంఘాల దేశవ్యాప్త సమ్మె..

Jewellers nation wide strike on aug 23 against hallmarking

jewellers srike, nation-wide jewellers strike, jewellers srike aug 23, HallMarking, All India Gem, Gem and Jewellery Domestic Council (GJC), Jewellery associations

Opposing the mandatory hallmarking of gold jewellery that came into force from June 16 in a phased manner, the jewellers across the country have decided to observe a token strike on August 23. The All India Gem and Jewellery Domestic Council (GJC) and other associations of the jewellers including the Nagpur Sarafa Association will participate in the strike.

హాల్ మార్క్ కు వ్యతిరేకంగా 23న దేశవ్యాప్త సమ్మె: జ్యూవెలరీ అసోసియేషన్ సంఘాలు

Posted: 08/21/2021 02:49 PM IST
Jewellers nation wide strike on aug 23 against hallmarking

బంగారు వర్తకులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 23న దేశవ్యాప్తంగా ఉన్న బంగారు వర్తకులు, వ్యాపారులు ఈ సమ్మెలో పాల్గోననున్నారు. బంగారు ఆభరణాలపై తప్పనిసరి హాల్ మార్క్ విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వున్న జ్యువెలరీ వ్యాపారులు, బంగారు వర్తకులు ఈ సమ్మెలో పాల్గననున్నారని అఖిల భారత జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ జీజేసి సహా ఇతర బంగారు వర్తకుల అసోషియేషన్లు తెలిపాయి. జీజేసి పీలుపు మేరకు ఇతర అసోసియేషన్ అయిన నాగ్పూర్ సరాఫా అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది.

బంగారు నగలపై హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి చేసిన కేంద్రనిర్ణయానికి వ్యతిరేకంగా ఆగస్టు 23న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన జీజేసీకి నిర్ణయానికి తెలుగు రాష్ట్రాల జ్యువెలరీ వ్యాపారులు కూడా మద్దతు ప్రకటించారు.ఈ సమ్మెకు జెమ్స్ & జువెలరీ పరిశ్రమలోని నాలుగు జోన్లకు చెందిన 350 సంఘాలు మద్దతిచ్చినట్లు జీజెసీ చెప్పింది. వీటితో పాటు పలు ఇతర బంగారు వర్తక సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించాయని తెలిపింది. బంగారు ఆభరణాలపై హాల్‌ మార్కింగ్‌ “ఏకపక్షంగా అమలు” చేయడాన్ని జువెలరీ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

జూన్ 16 నుంచి దశలవారీగా బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేస్తూ వచ్చింది కేంద్రం. ఫేజ్-1 కింద 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాలో హాల్‌ మార్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం చెప్పింది. బంగారు నగలపై హాల్‌ మార్కింగ్ తో స్వర్ణం స్వచ్ఛత తెలుస్తుంది. ఈ ముద్ర వున్న ఆభరణాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలకు అనుగూణంగా వుంటుంది.ఈ ప్రమాణాలను ప్రతి వ్యాపారి పాటించాల్సి ఉంటుంది. బంగారు ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసే వినియోగ‌దారుడు మోస‌పోవద్దని కేంద్రం బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది. కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా బంగారు ఆభరణాలకు హాల్​మార్కింగ్​ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles