Live ammunition found in Paritala Siddhartha's baggage పరిటాల సిద్దార్ధ్ బ్యాగులో బుల్లెట్.. అధికారుల నోటీసులు

Airport police found a live bullet in paritala siddhartha s bag

Bullet in paritala Siddhartha luggage, Paritala Sidhartha Srinagar tour, paritala sunitha Younger son, paritala Siddhartha, Paritala Sunitha, Paritala Ravi, Paritala Sriram, Srinagar Tour, 5.56mm Bullet, Arms Act, CISF personnel, RGIA, Hyderabad, Telangana, Crime

Andhra Pradesh former minister, TDP leader Paritala Sunitha's younger son Paritala Siddhartha landed into trouble after Shamshabad airport police found a bullet in his bag. According to the reports, the police filed a case under the Arms Act after he tried to board the flight with a bullet in his bag.

పరిటాల సిద్దార్ధ్ బ్యాగులో బుల్లెట్.. అధికారుల నోటీసులు

Posted: 08/20/2021 02:28 PM IST
Airport police found a live bullet in paritala siddhartha s bag

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు సిద్ధార్థతో శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఆయన బ్యాగులో 5.56 ఎంఎం బుల్లెట్ లభించడమే అందుకు కారణమైంది. అయితే ఆయన బ్యాగులోకి ఆ బుల్లెట్ ఎలా వచ్చింది.? ఆయనే దానిని తీసుకువచ్చారా.? లేక మరెవరైనా దానిని ఆయనకు తెలియకుండా అందులో వేశారా.? ఆయనను కేసులో ఇరికించాలని ప్రత్యర్థుల వ్యూహాల్లో భాగంగానే ఆయన బ్యాగులోకి ఈ బుల్లెట్ చేరిందా అన్న విషయాలు తెలియాల్సి వుంది. కాగా, తనకు బుల్లెట్ తో ఎలాంటి సంబంధం లేదని.. అది తన బ్యాగులోకి ఎలా వచ్చిందో కూడా తెలియదని పరిటాల సిద్ధార్థ అధికారులకు ఇప్పటికే వివరణ ఇచ్చారని సమాచారం.

కాగా ఫ్యాక్షన్ నేపథ్యమున్న కుటుంబం, ప్రాంతం నుంచి వచ్చిన పరిటాల సిద్ధార్థ బ్యాగులో బుల్లెట్ బయటపడటంతో సీఐఎస్ఎష్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. క్రితం రోజు రాత్రి ఆయన తన స్నేహితులతో కలిసి శ్రీనగర్ వెళ్లేందుకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. చెక్ ఇన్ అయ్యే సమయంలో ఆయన బ్యాగును విమానాశ్రయంలో అధికారులు స్క్రీనింగ్ చేశారు. కాగా ఆయన బ్యాగులో అనుమానాస్పద వస్తువు కనబడటంతో దానిని పరిశీలించారు. అది కాస్తా బుల్లెట్ అని తెలుసుకన్న సీఐఎస్ఎఫ్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని సీఐఎస్ఎఫ్ అధికారులు. ఎయిర్‌పోర్టు పోలీసులకు దానిని అప్పగించారు. సిద్ధార్థపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బులెట్ లభ్యం కావడం పట్ల వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ బుల్లెట్‌కు, తనకు ఎలాంటి సంబంధం లేదని సిద్ధార్థ తన న్యాయవాదితో సంప్రదించిన తరువాత బుల్లెట్ పై వివరణ ఇస్తానని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో శ్రీనగర్ పర్యటనకు వెళ్లాల్సిన పరిటాల సిద్దార్థ్ ఇంటికి తిరుగు పయనం అయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles