Kedarnath priest wrote letter to President using his blood రాష్ట్రపతికి రక్తంతో లేఖ.. పూజారుల ఉపవాస నిరసన దీక్ష

Kedarnath priest wrote letter to president ramnath kovind using his blood

Kedarnath, chardam, Haridwar, President, Ramnath Kovind, PM Modi, Priest Santosh Trivedi, Teerath Purohit Samaj, Char Dham Devesathanam Board, Uttarakhand, Devotional

A priest from Kedarnath shrine has written a letter with his blood to President Ramnath Kovind, demanding scrapping of Char Dham Devasthanam Board (CDDB) and allowing priests to manage the shrines as they have been doing traditionally for centuries.

రాష్ట్రపతికి రక్తంతో లేఖ.. 2వ రోజుకు పూజారుల ఉపవాస నిరసన దీక్ష

Posted: 08/18/2021 11:47 AM IST
Kedarnath priest wrote letter to president ramnath kovind using his blood

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది పోందిన చార్ ధామ్ లలో ఒక్కటైన కేథార్ నాథ్ ఆలయంలో ఆర్చకులు ఆందోళన పట్టేందుకు సన్నథం అవుతున్నారు. ఇప్పటికే గత రెండేళ్లుగా తాము శాంతియుత పద్దతుల్లో నిరసనను వ్యక్తం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వం కూడా స్పందించడం లేదని అరోపిస్తున్న వీరు.. తాజాగా ఏకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. రాష్ట్రపతితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశారు. అయితే ఇది సాధారణమైన లేఖలు కాదు.. ఏకంగా అర్చకులు తమ రక్తంతో ఈ లేఖలను రాయడం గమనార్హం.

పరమశివుడు కొలువైవున్న ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్​నాథ్ ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్ థామికి  రాసిన లేఖలో ఛార్ థామ్ దేవస్థానం బోర్డును వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు కేదార్ నాథ్ దేవాలయంలోని ధమ్​ సాకేత్ బగాదీ, నితిన్ బగ్వాడీ పూజారులు..తీర్థపురోహిత్ సాకేత్ బగ్వాడీ,కేదార్ సభ అధ్యక్షుడు వినోద్ శుక్లా సమక్షంలో ఆందోళన చేపట్టి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్ర సీఎంకు రక్తంతో లేఖలు రాసి తమ నిరసన తెలిపారు. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి పలువురు పురోహితులు. ఇలాగే రక్తంతో లేఖలు రాశారు.

రెండు నెలలుగా..కేదార్​నాథ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని దాదాపు రెండు నెలలుగా అర్చకులు ఆందోళన చేస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేసినప్పటినుంచి తమ హక్కులకు భంగం కలుగుతోందన్నారు. బోర్డును రద్దు చేసేంతవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.దేవస్థానం బోర్డును రద్దు చేయాలని నినాదాలు చేస్తున్నారు. గత మంగళవారం నుంచి ఉపవాసంతోనే నినాదాలు చేస్తున్నారు. ఈ లేఖలో పురాణ కాలం నుండి కేదార్‌నాథ్‌లో యాత్రికుల అర్చకుల హక్కులకు సంబంధించిన అనేక హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు.

చార్ ధామ్ దేవస్థానం బోర్డు అనాధిగా వస్తున్న ఆచారాలను కాదని, కొత్త సంప్రదాయాలకు శ్రీకారం చుట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేస్తూ.. దేవస్థానం బోర్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్స్ నెరవేర్చలా నిర్ణయం తీసుకోకపోతే..ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేదార్ సభ అధ్యక్షుడు వినోద్ శుక్లా, ఆచార్య సంతోష్ త్రివేది, కుబేర్‌నాథ్ పోస్తి, నితిన్ బగవాడి, ప్రదీప్ శర్మ, సవన్ బాగ్వాడి, ప్రకాశ్ చంద్ర తిన్సౌలా, రమాకాంత్ శర్మలతో పాటు పలువురు యాత్రికులు కూడా పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles