Man finds Rs 96 lakh cash underneath refrigerator అదృష్టమంటే ఇదేరా.. పాత ఫ్రిడ్జి కొంటే రూ.96లక్షలు దొరికాయ్..

Man buys used refrigerator and finds rs 96 lakh cash taped underneath

South Korea, Kimchi fridge, Cash under fridge, $130000 cash under fridge, Rs 96 Lakhs, Lucky Man, jeju Island, Police, Crime

A man from South Korea was left utterly dumbfounded after he found $1,30,000 cash taped to the bottom of a used kimchi fridge he bought online. According to reports, the man hails from Jeju Island in South Korea and had no clue about the money under the appliance. The cops said the man filed a report for the cash on August 6, saying he found it while cleaning the recently-delivered fridge.

అదృష్టమంటే ఇదేరా.. పాత ఫ్రిడ్జి కొంటే రూ.96లక్షలు దొరికాయ్..

Posted: 08/16/2021 04:12 PM IST
Man buys used refrigerator and finds rs 96 lakh cash taped underneath

అదృష్టం రాసిపెట్టి వుంటే అది పాతాళంలో వున్నా.. సరైన సమయంలో వచ్చి తగులుతుందని పెద్దలు అంటారు. అయితే ఎలా వచ్చి తగులుతుందన్ని మాత్రం చెప్పడం కష్టం. కొందరికి లాటరీ రూపంలో.. మరికోందరికి వజ్రాల రూపంలో.. ఇంకోందరికి లంకెబిందెల రూపంలో ఇలా ఏదో ఒక మార్గంలో మాత్రం వచ్చి చేరడం ఖాయం. ఇక్కడ తాజాగా ఓ వ్యక్తికి మరో రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఆన్ లైన్ లో పాత రిఫ్రిజిరేట‌ర్‌ను కొనుగోలు చేసిన ఈ వ్య‌క్తికి ఫ్రిడ్జ్ కింద ఏకంగా రూ. 96 ల‌క్ష‌ల న‌గ‌దు (1.3ల‌క్ష‌ల డాల‌ర్లు) క‌నిపించింది. ఈ ఘ‌ట‌న ద‌క్షిణ కొరియాలో వెలుగుచూసింది.

ద‌క్షిణ కొరియాలోని జెజు ఐలాండ్ కు చెందిన అదృష్టవంతుడు ఓ పాత ఫ్రిడ్జ్ కొనాలని ఆన్ లైన్ వేదికగా ఎంచుకుని దానిని అర్డర్ చేశాడు. అన్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఈ పాత ఫ్రిడ్జ్ దాదాపు మూడు రోజుల తరువాత అతని ఇంటికి డెలివరీ అందించారు వర్తకులు. అయితే దానిని తన ఇంట్లో ఏర్పాటు చుసుకునే క్రమంలో ఆయన ప్రిడ్జ్ ను శుభ్రం చేస్తుండగా, దాని కింద భారీ మొత్తంలో నగదు దాచి ఉంచడం గమనించాడు. రిఫ్రిజిరేట‌ర్ కింద అంత న‌గ‌దు ఎలా ఉంద‌నే విష‌యం అంతుబ‌ట్ట‌లేదు. దీంతో ఆయన పోలీసులకు పిర్యాదు చేసి.. తనకు దొరికిన డబ్బును అందజేసి విషయాన్ని చెప్పాడు.

న‌గ‌దు ట్రాన్స్‌ప‌రెంట్ ప్లాస్టిక్ షీట్స్‌లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ కింద ఉంచారు. ఈ డ‌బ్బును స‌ద‌రు వ్య‌క్తి పోలీసుల‌కు అప్ప‌గించాడు. ఇంత డ‌బ్బు ఎందుకు ఇక్క‌డ ఉంచార‌నే దానిపై ఫ్రిడ్జ్ విక్రేత‌ను గుర్తించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసులు తెలిపారు. ఇక ద‌క్షిణ కొరియా చ‌ట్టాల ప్ర‌కారం ఈ డ‌బ్బు ఎవ‌రిద‌నేది గుర్తించ‌ని పక్షంలో దాన్ని గుర్తించిన వ్య‌క్తికే అది చెందుతుంది. అదే జ‌రిగితే రిఫ్రిజిరేట‌ర్ య‌జ‌మాని మొత్తం న‌గ‌దులో 22 శాతం ప‌న్నులు చెల్లించ‌గా మిగిలిన మొత్తం సొంతం చేసుకోవ‌చ్చు. డ‌బ్బు వేరొక‌రిద‌ని తేలినా రిఫ్రిజిరేట‌ర్ ఓన‌ర్‌కు కొంత‌మొత్తం ప‌రిహారం ల‌భిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles