Death toll of powerful earthquake in Haiti soars to 1,297 హైతీ భూవిలయంలో అంతకంతకూపెరుగుతున్న మృతుల సంఖ్య

Haiti earthquake death toll soars to over 1 000 more than 5 000 injured

Earthquake, Haiti, Haiti earthquake, death toll, rescue operation, haiti news, Death toll in Haiti earthquake climbs to 1297, usaid, united nations, UNICEF, U.S. National Hurricane Center, U.S. Geological Survey, U.S. Coast Guard, search continues for survivors

The death toll from a 7.2-magnitude earthquake in Haiti climbed to 1,297 on Sunday, a day after the powerful temblor turned thousands of structures into rubble and set off franctic rescue efforts ahead of a potential deluge from an approaching tropical storm. Saturday's earthquake also left at least 5,700 people injured in the Caribbean nation, with thousands more displaced from their destroyed or damaged homes.

హైతీ భారీ భూకంపం.. 1300 మంది మృతులు.. వేల మంది నిరాశ్రయులు

Posted: 08/16/2021 11:23 AM IST
Haiti earthquake death toll soars to over 1 000 more than 5 000 injured

కరీబియన్ దేశం హైతీపై ప్రకృతి పగబట్టినట్టు వుంది. గత శనివారం హైతీలో 7.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంప విషాదగాయం తగిలిన రెండు రోజుల వ్యవధిలోనే మరో విషాదం ముంచుకోస్తోంది. ఓ వైపు భూప్రళయం పంజాధాటికి కాకవికళమైన హైతీపై మరో తుఫాను ముంచుకొస్తోంది. కూలిన ఇళ్లు. గాయపడిన కుటుంబసభ్యులు, బంధువుల విషాధవదనాలు, అర్థనాధాలతో అసుపత్రుల ఆవరణ అంతా భీతావహ వాతారణం అలుముకుంది. భూవిలయం ఇప్పటికే వందలాది మందిని పోట్టనపెట్టుకోగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. వారిలో అనేక మంది ఇప్పటికీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

దీంతో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వుంది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య నిన్నటికి 1,297కు పెరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా భూవిలయం ధాటికి 5,700 మందికి పైగా గాయపడ్డారు. భారీ భూప్రకంపనల కారణంగా మరెంతో మంది నిరాశ్రయులు అయ్యారు. భూకంపం ధాటికి వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం పెను విలయాన్నే సృష్టించింది.

శనివారం రోజంతా ప్రకంపనలు వణికించగా, నిన్న తెల్లవారుజామున కూడా భూమి ఆరుసార్లు కంపించింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా వీధుల్లోనే గడిపారు. తీరప్రాంత పట్టణమైన లెస్ కేయస్‌ తీవ్రంగా దెబ్బతింది. క్షతగాత్రులను ఇక్కడి నుంచి రాజధానికి తరలించేందుకు మాజీ సెనేటర్ ఒకరు ప్రైవేటు విమానాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని పోగొట్టుకున్న వారి రోదనలతో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. కాగా, 2010లో ఇక్కడ సంభవించిన భారీ భూకంపం కారణంగా 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles