3 Deaths In Maharashtra From Delta Plus Variant డెల్టా ప్లస్ విజృంభన.. మహారాష్ట్రలో మూడవ మరణం

Delta plus variant claims third life in maharashtra victim was fully vaccinated

delta plus variant, covid-19, coronavirus, coronavirus delta plus variant,COVID-19, covid, corona vaccine Antibodies, COVID-19 Vaccines, Coronavirus, Corona Vaccine, Mumbai, maharashtra

Maharashtra has reported the third death caused by the Delta Plus variant of coronavirus. The latest fatality has been reported from the Raigad district. As per the Maharashtra government officials, the third person to die after being infected with the Delta Plus variant is a 69-year-old man. Moreover, the deceased was fully vaccinated.

డెల్టా ప్లస్ విజృంభన.. మహారాష్ట్రలో మూడవ మరణం

Posted: 08/13/2021 03:48 PM IST
Delta plus variant claims third life in maharashtra victim was fully vaccinated

కరోనా మహమ్మారి మరోమారు యావత్ ప్రపంచాన్ని వణించనుంది. ఈ సారి రూపాన్ని మార్చుకున్న కరోనా.. డెల్టా వేరియంట్ తో విజృంజనుందా.? అంటే ఔనని చెప్పక తప్పదు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలలో డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో డెల్టా వేరియంట్ బారిన పడి బాధితురాలు మరణించిందని.. అమెకు సోకింది డెల్టా ప్లస్ వేరింయట్ అని అధికారులు స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్రలో డెల్టా వేరియంట్ తో మరణించిన రోగుల సంఖ్య మూడుకు చేరింది.

తాజాగా రాయ్ గడ్ జిల్లాకు చెందిన 69 ఏళ్ల వ్యక్తికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది. రెండు డోసుల వాక్సీన్ తీసుకున్నా అతనికి కరోనా సోకడం గమనార్హం. జూలై 27న డెల్టా వేరియంట్ తో ఒక మహిళ చనిపోయారని అధికారులు తెలిపారు. గత నెల 21క 63ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడ్డారని, అమె మధుమేహంతో పాటు ఇతర రుగ్మతలతోనూ బాధపడుతుందని తెలిపారు. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న తరువాత కూడా అమెకు కరోనా సోకిందని అధికారులు గుర్తించారు.

దీంతో అమెలో టీకాలు వృద్దిచేసిన యాంటీబాడీలు ఏమయ్యాయని అధికారులు విస్మయం చెందారు. కాగా ఆమె నుంచి సేకరించిన జీనోమ్ శ్యాంపిళ్ల సీక్వెన్సింగ్ నివేదిక రావడంతో అమెతో సన్నిహితంగా మెలిగిన వారి జాబితాపై అధికారులు అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటికే అమెతో క్లోజ్ గా వ్యవహరించిన మరో ఇద్దరికి కూడా కరోనా డెట్లా ప్లస్ వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. కాగా, మరణించిన 63 ఏళ్ల కరోనా డెల్టాప్లస్ వేరియంట్ రోగికి మాత్రం ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు తెలిపారు.

ఇక కరోనా సోకిన నేపథ్యంలో సదరు బాధితురాలికి ఆక్సీజన్ తో పాటు ట్రీట్ మెంట్ చేశారని, రెమ్ డెసివీర్ ఇంజక్షన్లతో పాటు స్టెరాయిండ్స్ కూడా చికిత్సలో భాగంగా ఇచ్చామని, అయినా అమె కొలుకోలేదని వైద్యులు తెలిపారు. దీంతో డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమని వినబడుతున్న వార్తల్లో నిజం లేకపోలేదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇక ఈ మహిళ మృతితో మహారాష్ట్రలో కరోనా డెల్టా వేరియంట్ తో మరణించిన వారి సంక్య మూడుకు చేరింది. గ‌త నెల‌లో ర‌త్న‌గిర‌కి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఆ వేరియంట్‌కు బ‌ల‌య్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Mumbai  Delta Plus Covid variant  Delta Plus  Covid variant  Covid-19  Maharashtra  

Other Articles