Two girls fight on Road for boyfriend in Jharkhand బాయ్ ఫ్రెండ్ కోసం బజారులో యువతుల సిగపట్లు..

Two girls fight over boyfriend on street in jamshedpur of jharkhand

fight, girls, boyfriend, Street fight, Girlfriends fight for boyfriend, Nibba nibbi fight, nibba nibbi, Fight for love, Girls fight for boyfriend, Jharkhand news,

On the middle of the road, two women clashed over their lover. People kept watching and understanding the matter as spectators. During this there was a situation of road jam. On receiving the information, the police reached the spot, after which both the parties went to the Sakchi police station and left after giving a warning late at night.

ITEMVIDEOS: బాయ్ ఫ్రెండ్ కోసం బజారులో యువతుల సిగపట్లు..

Posted: 08/13/2021 11:35 AM IST
Two girls fight over boyfriend on street in jamshedpur of jharkhand

దొంగ-దొంగది చిత్రంలో హీరో మంచు మనోజ్ కోసం బజార్లో తగువుపడ్డ యువతులను చూశాం.. ఇలాంటి సన్నివేశాలు ఆ తరువాత కూడా చాలా చిత్రాల్లోనే వచ్చాయి. అయితే సినిమాల్లో రెండున్నర గంటల ఆటను రక్తికట్టించడానికి ఇలాంటి ఘటనలు బాగుంటాయ్ కానీ.. అదే నిజజీవితంలో ఇలాంటి ఘటనలు ఎదురయితే.. చాలా కష్టం. ఎందుకంటే జీవితం అన్నది నూరేళ్ల ఆట. కోపంలో తీసుకున్న నిర్ణయానికి మనం అనునిత్యం అనుభవించాల్సి వుంటుంది. అయితే ఇలాంటి ఘటనలతో జీవితంలో సంతోషాన్ని కూడా దూరం చేసుకున్నవాళ్లం అవుతామని గ్రహించాలి.

అది తెలియక.. జీవితాన్ని కూడా సినిమాలా భావించిన ఇద్దరు యువతులు బాయ్ ఫ్రెండ్ కోసం నడిజబారులో సిగపట్లకు దిగారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కిందపడి బాహాబాహీకి దిగారు. తన బాయ్‌ఫ్రెండ్ మరో యువతితో తిరుగుతుండడాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన మరో యువతి తట్టుకోలేకపోయింది. ఆమె జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది. ఆమె కూడా ఎదురుతిరిగింది. దీంతో సీన్ రసవత్తరంగా మారింది. ఇద్దరూ నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు కిందపడి మరీకొట్టుకున్నారు. తామేం చేస్తున్నామో అన్న విషయం కూడా మర్చిపోయారు. అయితే వీరిని విడిపించేందుకు ఓ యువతితో సహా అక్కడే వున్న బాయ్ ఫ్రెండ్ ప్రయత్నించారు.

వారి ప్రయత్నాలను తోసిరాజుతూ కిందపడిన యువతులు మరింతగా రెచ్చిపోయారు. వీరు విడదీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. వారు ఆగలేదు సరికదా, మరింతగా చెలరేగిపోయారు. ఈ క్రమంలో తన స్నేహితురాలిని కొడుతున్న యువతి చేయిపట్టుకుని లాగడంతో బాయ్ ఫ్రెండ్ కు కోసం వచ్చింది. అంతే అతను విడదీస్తున్న యువతిపై మండిపడ్డటంతో పాటు చేయికూడా చేసుకున్నాడు. దీంతో కిందపడి కొట్టుకున్న యువతులు విడిపోయారు. అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకునేలోపే యువతులిద్దరూ పరారయ్యారు. ఝార్ఖండ్ లోని జరాయ్ కేలాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ ఒక లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles