Trending Video: Lion Cub Playing With It's Mother తల్లితో సింహం పిల్ల ఆటలు.. నెటిజనులు ఫిదా

Adorable viral video of a lion cub playing with its mother is the cutest ever

viral videos, youtube, wildife videos, lion cubs, Trending Video, Lion Cub, Indian Forest Services, Lifestyle, Lifestyle news, Lifestyle latest news

A trending video of a lion cub playing and cuddling with its mother is circulating the internet, and the video was among the cutest as it witnesses the purest bond of the world featuring the cub with its mother. It is one of the sweetest wildlife clip seen in a long time

ITEMVIDEOS: తల్లితో సింహం పిల్ల ఆటలు.. నెటిజనులు ఫిదా

Posted: 08/12/2021 07:01 PM IST
Adorable viral video of a lion cub playing with its mother is the cutest ever

సృష్టిలో అమ్మతనం అనేది ప్రతిసృష్టే. అందుకే అమ్మ అనే పదం ఎంతో మధురం. అయితే ఆ అమ్మ ఎంత కష్టనష్టాన్ని ఓర్చినా.. బిడ్డ చెంతకు వచ్చే సరికి మాత్రం అన్నింటినీ మర్చిపోతుంది. ఈ అమ్మతనం మనిషి అయినా, పక్షులైనా, జంతువైనా, క్రూరమృగమైనా తన బిడ్డల జోలికి ఎవరు వచ్చినా సహించదు. అదే బిడ్డతో ఆడుతూ మైమర్చిపోవాలన్నా.. కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నా అమ్మకు లేదు సాటి. బిడ్డకు ఆకలేస్తే అమ్మ మనస్సు ఆగదు.అలాగే బిడ్డతో కలిసి ఆటా పాటా అంటే తల్లికి ఎంతో ఇష్టం. తల్లి పిల్లల ఆటలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు.

అమ్మతో కలిసి ఆడే బిడ్డ ప్రపంచం అంతా అమ్మలాగే కనిపిస్తుంది.అలాగే తల్లి కూడా బిడ్డతోనే లోకం అనుకుంటుంది. అది మనిషి అయినా జంతువైనా సరే తల్లీ బిడ్డల ప్రేమకు ఎవరైనా ఒక్కటే. అలాంటి ఓ తల్లీ బిడ్డల ఆటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తల్లి ఓ సింహం. ఆ పిల్ల దాని కూన. తల్లితో సింహం పిల్ల ముద్దు ముద్దుగా ఆడుకుంటోంది. కానీ తల్లి సింహం పిల్లను పట్టించుకోలేదు. దాంతో ఆ సింహం పిల్ల కాస్త అలిగినట్లుగా తల్లికి దూరంగా చిన్న చిన్నగా అరుచుకుంటూ వెళ్లిపోయి ఇసుకలో పడుకుని తల్లి వంక చూస్తోంది. అప్పడు తల్లి సింహం పిల్ల సింహం వద్దకు వచ్చి బిడ్డతో ఆడుకుంటున్న వీడియో ఐఎఫ్ ఎస్ ఆఫీసర్ సురేందర్ మెహ్రా లో షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles