పలు కీలక తీర్పుల్లో భాగస్వామైన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి.. జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారీమన్ ఇవాళ రిటైర్ అయ్యారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి అయిన నారీమన్.. ఇవాళ పదవీ విరమణ పోందారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణతో కలిసి కోర్టు హాల్ నంబర్-1లో కూర్చున్నారు. రిటైర్ అవుతున్న జడ్జిలు తమ చివరి రోజున ఈ హాల్లో కూర్చోవడం ఆనవాయతీగా వస్తోంది. జస్టిస్ నారీమన్ కు వీడ్కోలు పలికే కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్షణం కొంత ఉద్విగ్నంగా ఉందని, తన ఆలోచనల్ని వ్యక్తపరచడం ఇబ్బందిగా ఉందని సీజే రమణ అన్నారు.
నారీమన్ పదవీ విరమణతో న్యాయవ్యవస్థకు రక్షణగా ఉన్న సింహాల్లో ఒకదాన్ని కోల్పోయినట్లు తాను భావిస్తున్నాని ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ రూపంలో భారత న్యాయవ్యవస్థ అపార అనుభవమున్న ఓ న్యాయమూర్తిని కోల్పోయిందని ఎన్వీ రమణ అన్నారు. మన బలమైన న్యాయ వ్యవస్థకు ఆయన ఒక పిల్లర్ అన్నారు. నారీమన్ ఎల్లప్పుడూ న్యాయం వైపు నిలబడ్డట్లు సీజేఐ చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన ఏడేళ్ల పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులను నారీమన్ వెలువరించారని పేర్కొన్నారు. 35 ఏళ్లపాటు విజయవంతంగా న్యాయవాదిగా సేవలందించిన జస్టిస్ నారీమన్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఐదో లాయర్ అని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేశారు.
కాగా, ప్రఖ్యాత న్యాయవాది ఫాలీ నారీమన్ కుమారుడే రోహింగ్టన్ నారీమన్. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన జస్టిస్ నారీమన్ 35 ఏళ్ల పాటు న్యాయవృత్తిలో కొనసాగారు. 37 ఏళ్ల వయసులో సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టులో రోహింగ్టన్ నియమితులైయ్యారు. 2011లో ఆయన్ను సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించారు. 2014 జులై 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ నారీమన్.. తన ఏడేళ్ల కాలంలో 13,500 కేసులను పరిష్కరించారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి పోలీసులకు అరెస్ట్ చేసే అధికారమిచ్చే ఐటీ చట్టంలోని నిబంధన కొట్టివేత, స్వలింగ సంపర్కం నేరం కాదని, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వంటి చారిత్రక తీర్పులు వెలువరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more