Massive Snake Carefully Extracted from Ceiling బెడ్ రూం సీలింగ్ లో భారీ కొండచిలువ.. ఎలా బుసకోడుతోందో.!

Rescue worker removes giant snake from ceiling of home

snake in bedroom ceiling, python in bedroom ceiling, snake cacther extracts python carefully, Snake Rescued, bedroom, python, Snake, ceiling, trending videos, viral hog, viral video, video viral, social media

Few creatures inspire more fear in human beings than a snake. Now, imagine finding one of them in your ceiling. This viral clip, put out by a channel called ViralHog, shows a rescue worker extracting a large snake, measuring several feet, from a ceiling. The clip shows a rescue worker slowly peeling off a section of the ceiling. The ceiling cracks to reveal an enormous snake.

ITEMVIDEOS: బెడ్ రూం సీలింగ్ లో భారీ కొండచిలువ.. ఎలా బుసకోడుతోందో.!

Posted: 08/10/2021 06:12 PM IST
Rescue worker removes giant snake from ceiling of home

ఇంట్లోకి పాము దూరిందా.. ఏ కర్ర పెట్టి కొట్టో చంపేయడమో.. చప్పుడు చేసి బెదిరించి పంపేయడమో చేస్తాం. అదే నగరాలు, పట్టణాలైతే.. వెంటనే పాములు పట్టుకునే స్నేక్ క్యాచర్ లకు ఫోన్ చేసి పిలుస్తాం. కానీ కొండకొనల్లో సంచరించాల్సిన కొండచిలువ వనవాసం వీడి గృహస్థాశ్రయం అలవాటు పడితే.. ఆ ఇంట్లోని వారికి నరకప్రాయమే. అచ్చంగా ఇదే జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన భారీ కొండచిలువ ఏకంగా వారి బెడ్ రూమ్ లోని సీలింగ్ పైకి చేరింది. అయితే దీనిని ముందుగానే గమనించిన ఇంట్లోని సభ్యులు రెస్క్యూ టీంకు ఇన్ఫామ్ చేశారు. రెస్య్కూ టీమ్ సభ్యుడు వచ్చి.. చాకచక్యంగా పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇంట్లోని సభ్యులు తమ ఇంట్లో తమ ప్రమేయం లేకుండా ఏదో చప్పుడవుతుందని గమనించారు. ఏంటది అని వెతకసాగారు. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని శ్రద్దగా చూశారు. కొంతసేపటికి శబ్దం ఫాల్స్ సీలింగ్ పై నుంచి శబ్దం వస్తుందని గమనించారు. తీరా అదేంటా అని చూడటానికి ప్రయత్నించగా.. అది కొండచిలువ అని అర్థమైంది. దీంతో హుటాహుటిన రెస్క్యూ టీమ్ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా.. అది సీలింగ్ లో ఇరుక్కుపోయిందని గమనించారు.

అయితే దాని మధ్య భాగం మాత్రమే కనబడుతుండటంతో దానిని బయటకు తీయడం సాధ్యం కాలేదు. చాలా సేపు స్టిక్ తీసుకుని దానిని కదిలిస్తుండటంతో ఒక్కసారిగా కిందకు దూకే ప్రయత్నం చేసింది. అలా కిందకు రావడంతోనే విషం చిమ్మేందుకు ప్రయత్నించింది. ఆ వ్యక్తి తప్పుకుని తోక అందిపుచ్చుకున్నాడు. బుసలు కొడుతూ కాటేసేందుకు ప్రయత్నిస్తున్న పాము మరోసారి అతని కాలును టార్గెట్ చేసింది. కాటేయబోతుండగా తలను వేరే వస్తువుతో తొక్కి పట్టి పట్టుకున్నాడు. తలకింది భాగాన్ని చేతిని అందుకుని ఎట్టకేలకు దానిని అదుపులోకి తీసుకొచ్చాడు.

వైరల్ హగ్ అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ అయిన ఈ వీడియోపై మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు పామును పట్టుకున్న తీరును పొగుడుతుంటే.. మరికొందరు పాము ఎంత ప్రమాదకమో చెప్తున్నారు. మిగిలిన వాళ్లు ఘటన జరిగిన ప్రదేశం గురించి మాట్లాడుతున్నాయి. ఫ్లోరిడాలో.. థాయ్ లాండ్ లో.. మలేసియాలో జరిగిందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ రెస్క్యూ టీంను బట్టి చూస్తుంటే ఇది ఇండియాలో జరిగిన ఘటన కాదనేది స్పష్టమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Snake Rescued  bedroom  python  Snake  ceiling  trending videos  viral hog  viral video  video viral  social media  

Other Articles