TTD to perform garuda seva twice in august తిరుమల శ్రీవారికి శ్రావణమాసంలో రెండు పర్యాయాలు ‘గరుడ సేవ’

Tirumala tirupati devasthanam to perform garuda seva twice in august

Garuda Seva, Shravan Panchami, Shravana Purinma, August Month, Tirumala Tirupati Devasthanam, Andhra pradesh, Devotional

Tirumala Tirupati Devasthanam to perform garuda seva twice in Auspicious Shravana masam (August), On the eve of Shravan Panchami ie on 13 August and Shravana Purnami ie on Ausgust 22 the Garuda seva is conducted, said TTD officials.

తిరుమల శ్రీవారికి శ్రావణమాసంలో రెండు పర్యాయాలు ‘గరుడ సేవ

Posted: 08/10/2021 02:32 PM IST
Tirumala tirupati devasthanam to perform garuda seva twice in august

 కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగుబంగామైన తిరుమల వేంకటేశ్వరస్వామివారికి ప్రీతికరమైన పవిత్ర శ్రావణమాసంలో రెండు పర్యాయాలు గరుడ వాహనసేవ జరుగనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. ఆగస్టులో శ్రావణ మాసం పురస్కరించుకుని ఈ సేవను నిర్వహించనున్నమాని తెలిపారు. శ్రావణ మాసంలోని శెుక్ల పంచమిని గరుడ పంచమిగా పిలుస్తారు. దీనినే నాగుల పంచమిగా కూడా కొలిచే భక్తులు ఈ రోజున పుట్టలలో పాములకు పాలు పోసేందుకు కూడా పోటీ పడతారు, పాముకు కూడా దేవతారాధన చేసే సంప్రదాయం హైందవ ధర్మంలో ఇమిడివుంది.

దీంతో శ్రావణ శుక్లపంచమి, శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా ఆగస్టు 13న, ఆగస్టు 22న.. మలయప్పస్వామి గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.  ఈ నెల 13న గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి వారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు. ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు,

స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ‘గరుడపంచమి’ పూజ చేస్తారని ప్రాశస్త్యం. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవ జరుగుతుంది. 22న శ్రావణ పౌర్ణమి సందర్భంగా సేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles