Sఢ refuses to halt CCI probe against Flipkart and Amazon అమెజాన్​, ఫ్లిప్​ కార్ట్​ లకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Supreme court rejects amazon flipkart s plea against cci investigation

supreme court flipkart amazon probe, flipkart amazon competition commission probe, flipkart, amazon, supreme court news, flipkart amazon antitrust probe, Business news, Supreme Court, Flipkart, Amazon, Competition Commission of India, CJI, CCI, National Politics

The Supreme Court refused to halt an inquiry into Amazon and Flipkart’s business practices by the Competition Commission of India (CCI). The CCI had ordered the investigation against the two companies last year for allegedly promoting select sellers on their e-commerce platforms, and using business practices that stifle competition.

ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్​, ఫ్లిప్​ కార్ట్​ లకు చుక్కెదురు

Posted: 08/09/2021 04:59 PM IST
Supreme court rejects amazon flipkart s plea against cci investigation

ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అవిశ్వాస విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆయా సంస్థలకు కోర్టు తేల్చి చెప్పింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరుతూ సదరు సంస్థలు వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సంస్థల పిటిషన్ ను విచారించింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇలాంటి విచారణలు, పారదర్శకతకు స్వచ్ఛందంగా సహకరిస్తాయని అనుకుంటున్నామని జస్టిస్ రమణ అన్నారు. కానీ, ఈ బడా సంస్థలు విచారణకు జంకుతున్నాయని.. అసలు విచారణే వద్దంటున్నారని కాస్తంత ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ‘‘సీసీఐ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మీరు చెబుతున్నారు. ఏ తప్పూ చేయలేదంటున్నారు. అలాంటప్పుడు భయమెందుకు? విచారణను ఎదుర్కోవాల్సిందే’’ అని తేల్చి చెప్పారు. సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని పేర్కొన్న ఆయన.. వాటిని కొట్టేశారు.

నాలుగు వారాల్లోగా సీసీఐ విచారణకు హాజరు కావాలని ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు ఆదేశాలిచ్చారు. కాగా, కేవలం ఎంపిక చేసిన సెల్లర్లకే రెండు సంస్థల్లో వ్యాపారాలకు అవకాశం ఇస్తున్నారని, దాని వల్ల పోటీలేకుండా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ సీసీఐ గత ఏడాది దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, ఆ ఆరోపణలను తోసిపుచ్చిన సంస్థలు.. కర్ణాటక హైకోర్టులో వ్యాజ్యాలు వేశాయి. వాటిని హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వాటిని నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Flipkart  Amazon  Competition Commission of India  CJI  CCI  National Politics  

Other Articles