Fashion outlet to pay Rs 2500 for charging on bag అన్ లిమిటెడ్ స్టోర్ కు చేధు అనుభవం.. రూ.2500 జరిమానా..

Fashion outlet in hyd ordered to pay rs 6 25 back charged on shopping bag

shopping, Shopping bag, Unlimited store, Fashion Outlet, Rangareddy consumer commission, S Umesh Kumar, AS Rao Nagar, Hyderbad

A court order ruled a fashion outlet in city’s outskirts to pay back a customer Rs 6.25, that was charged on a shopping bag in 2019. Rangareddy consumer commission was hearing a petition filed by one S Umesh Kumar, who bought two jeans pants costing Rs 1,198 in April 2021 from the Unlimited store located in AS Rao Nagar.

అన్ లిమిటెడ్ స్టోర్ కు జరిమానా.. రూ. 6 కవర్ కు రూ.2500 పరిహారం

Posted: 08/06/2021 03:28 PM IST
Fashion outlet in hyd ordered to pay rs 6 25 back charged on shopping bag

నాది కానిది ఒక్క రూపాయైనా నేను ఆశపడను.. నాదైన ఒక్క రూపాయిని నేను వదులుకోను అన్న డైలాగ్ మాదిరిగానే కాసింత చట్టాలపై అవగాహన వున్న ఏ వ్యక్తులైనా.. ఇలాగే అలోచిస్తారు. అయితే సభ్యసమాజంలో మరీ చిల్లర డబ్బుల కోసం ఎందుకులే అనుకునేవారు మాత్రం చిన్నచితక కేసులంటూ వదిలేస్తుంటారు. కానీ ఇది అన్యాయం అని పోరాడే వారు మాత్రం వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే వుంటారు. అలాంటి వారిలో ఎస్ ఉమేష్ కుమార్ ఒకరనే చెప్పాలి. తనకు జరిగిన అన్యాయంపై ఆయన ఏకంగా కన్యూమర్ కమీషన్ లో కేసు వేసి మరీ పోరాడారు.

మాల్స్‌లో, రీటైల్ స్టోర్స్‌లో క్యారీ బ్యాగ్‌లపై వారి లోగోలను వేసుకున్న కవర్లను అనేక మంది పట్టుకుని తిరుగుతుండటం చూశాం. అయితే.. ఇలానే ఉమేష్ కుమార్ కూడా గత ఏప్రిల్ మాసంలో అన్ లిమిటెడ్ ఫ్యాషన్ అవుట్ లెట్ కు వెళ్లి షాపింగ్ చేశారు. అక్కడ షాపింగ్ అనంతరం కవరుకు కూడా రేటు కట్టి విక్రయించడం గమనించిన ఆయన.. దీనిపై కన్జూమర్ కోర్టులో కేసు వేసి గెలిచారు, వినియోగదారుల ఫోరం క్యారీ బ్యాగ్‌ను అమ్మినందుకు అన్‌లిమిటెడ్‌ స్టోర్‌కు కవరు డబ్బులను తిరిగి చెల్లించడంతో పాటు జరిమానా కూడా విధించింది.

ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని జామ్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఎస్ ఉమేష్ కుమార్ అనే వ్యక్తి ఏఎస్ రావు నగర్‌లోని అన్‌లిమిటెడ్‌ స్టోర్‌లో 1,198రూపాయలు ఖర్చుపెట్టి రెండు జీన్స్‌ ప్యాంట్లను 2019 ఏప్రిల్‌లో కొన్నారు. బిల్లు చేతికిచ్చిన తర్వాత క్యారీ బ్యాగ్‌కు కూడా స్టోర్ రూ.6.25 వసూలు చేసింది. అన్‌లిమిటెడ్‌ లోగో ఉన్న సంచికి డబ్బులు ఎలా వసూలు చేస్తారంటూ ప్రశ్నించారు.

కాగా ఫ్యాషన్ ఔట్ లెట్ యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాలేదు. లోగో లేని సంచి ఇవ్వాలని కోరగా అటువంటి పని చెయ్యలేదు. దీంతో ఉమేశ్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. అప్పటి నుంచి విచారించిన రంగారెడ్డి జిల్లా కమిషన్‌ రూ.6.25 తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.1,500, కేసు ఖర్చుల నిమిత్తం రూ.1,000, ముప్పై రోజుల్లోగా కస్టమర్‌కు చెల్లించాలని అన్‌లిమిటెడ్‌ స్టోర్‌ను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles