Alcohol linked to nearly 750,000 cancer cases in 2020 దేశంలో 24 నకిలీ యూనివర్సిటీలు.. ఏపీలోనూ ఒక్కటి..

Ugc declares 24 universities as fake most from uttar pradesh

University Grants Commission (UGC), ugc, ugc fake universities, ugc list of universities, dharmendra pradhan, education ministry, fake university, fake universoties list, crime

The higher education regulatory body, University Grants Commission (UGC), has declared 24 "self-styled" institutes fake and has found two more in violation of norms, Union Education Minister Dharmendra Pradhan said on Monday. Mr Pradhan made the statement in response to a written question in Lok Sabha.

దేశంలో 24 నకిలీ యూనివర్సిటీలు.. ఏపీలోనూ ఒక్కటి..

Posted: 08/03/2021 06:39 PM IST
Ugc declares 24 universities as fake most from uttar pradesh

దేశంలోని 24 స్వయం ప్రకటిత విశ్వ‌విద్యాల‌యాల‌ు న‌కిలీ వ‌ర్సిటీలని ఉన్నత విద్యా రెగ్యూలేటరీ బాడీ యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) ప్ర‌క‌టించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తెలిపారు. అలాగే, మ‌రో రెండు యూనివ‌ర్సిటీలు నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ్డాయ‌ని వివ‌రించారు. వ‌ర్సిటీల‌కు సంబంధించిన‌ లోక్ స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఈ మేర‌కు స‌మాధానం ఇచ్చారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ప్ర‌జ‌లు, ఎల‌క్ట్రానిక్, ప్రింట్ మీడియా నుంచి వ‌చ్చిన ఫిర్యాదులను ప‌రిశీలించిన యూజీసీ 24 వ‌ర్సిటీల‌ను న‌కిలీవిగా తేల్చిందని అన్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలోని భార‌తీయ శిక్ష ప‌రిష‌త్, దేశ రాజధాని న్యూఢిల్లీలోని కుతుబ్ ఎన్ క్లేవ్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ సంస్థ‌లు యూజీసీ చ‌ట్టం-1956లోని నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు యూజీసీ గుర్తించిందని అన్నారు. కాగా ఈ రెండు వ‌ర్సిటీల అంశం న్యాయ‌స్థానం ప‌రిధిలో ఉంది' అని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ చెప్పారు. దేశంలోనే అత్యధిక న‌కిలీ యూనివ‌ర్సిటీలు కలిగిన రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ అని చెప్పారు. ఆ తరువాత దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ రమారమి అదే సంఖ్యలో నకిలీ వర్సిటీలు వున్నాయని అన్నారు.

న్యూఢిల్లీలో ఏకంగా ఏడు వర్సిటీలు నకిలీవని.. ఇక అదే క్రమంలో ఒడిశాలోని రెండు ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లోని రెండు వర్సిటీలు నకిలీవని తెలిపారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఒక్కో నకిలీ యూనివర్సిటీలు వున్నాయని తెలిపారు. ఈ యూనివర్సిటీలలో విద్యార్థులు ఎవరూ చేరకుండా యూజీసీ తగు చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ వర్సిటీలపై జాతీయ స్థాయిలోని హింది, ఆంగ్ల దినపత్రికలలో నకిలీ విశ్వవిద్యాలయలని ప్రకటనలు కూడా ఇస్తోందని అన్నారు. ఇక వీటిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్రాల సీఎస్ లకు కూడా లేఖలు రాస్తుందని తెలిపారు.

ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నగరంలోని భారతీయ శిక్షా పరిషత్, సహా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (IIPM), కుతుబ్ ఎన్‌క్లేవ్, న్యూఢిల్లీలోని రెండు వర్సిటీలు యూనివర్సిటీ గ్రాండ్స్ కమీషన్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని తెలిపిన ఆయన ఈ రెండింటికీ సంబంధించిన అంశలో న్యాయస్థానములో వుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ తెలిపారు.

దేశంలోని నకిలీ వర్సిటీల జాబితా ఇదే..

ఉత్తర ప్రదేశ్ ఎనిమిది నకిలీ విశ్వవిద్యాలయాలు -
1) వారణాసేయ సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి;
2) మహిళా గ్రామ విద్యాపీఠం, అలహాబాద్;
3) గాంధీ హిందీ విద్యాపీఠ్, అలహాబాద్;
4) నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్;
5) నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, అలీఘర్;
6) ఉత్తర ప్రదేశ్ విశ్వవిద్యాలయ, మధుర;
7) మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌గఢ్
8) ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, నోయిడా.

ఢిల్లీ ఏడు నకిలీ విశ్వవిద్యాలయాలు -
1) కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్,
2) యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ,
3) ఒకేషనల్ యూనివర్సిటీ,
4) ADR సెంట్రిక్ న్యాయ న్యాయ విశ్వవిద్యాలయం,
5) ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
6) స్వయం ఉపాధి కోసం విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ
7) ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం).

పశ్చిమ బెంగాల్‌లో రెండు నకిలీ విశ్వవిద్యాలయాలు
1) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా
2) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా

ఒడిశాలో రెండు నకిలీ విశ్వవిద్యాలయాలు
1) నభభారత్ శిక్షా పరిషత్, రూర్కెలా
2) నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ.

ఐదు రాష్ట్రాలలో ఒక్కొక్క నకిలీ వర్సిటీ

శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, పుదుచ్చేరి;
క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్;
రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగపూర్; మహారాష్ట్ర
సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, కేరళ
బడగంవి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కర్ణాటక.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dharmendra Pradhan  24 fake universities  Uttar Pradesh  Delhi  Odisha  West Bengal  India  Lok Sabha  Parliament  

Other Articles