Shilpa Shetty not given clean chit yet: Mumbai Crime Branch శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇవ్వలేదన్న పోలీసులు

Shilpa shetty yet to get clean chit in pornography racket case crime branch

Raj Kundra, Mumbai Police, Porn Case, Raj Kundra News, Shilpa Shetty, pornography, mumbai crime branch, Porn Case News, Raj Kundra Latest News, Pornography Case News, Raj Kundra sent to Police Custody, Raj Kundra Police Custody, Raj Kundra arrested, shilpa shetty husband arrested, shilpa shetty husband case, raj kundra porn racket, Crime

The crime branch of Mumbai Police said it was yet to give a clean chit to Bollywood actor Shilpa Shetty in connection to the adult film racket in which her businessman-husband Raj Kundra is allegedly involved in.

నీలి చిత్రాల కేసు: శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇవ్వలేదన్న పోలీసులు

Posted: 07/28/2021 12:41 PM IST
Shilpa shetty yet to get clean chit in pornography racket case crime branch

 బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి భ‌ర్త, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన పోలీసులు పోర్నోగ్రఫీ (నీలిచిత్రాలకు) సంబంధించిన కేసు విచారణలోనూ వేగాన్ని పెంచారు. ఇప్పటికీ ఆయనను తమ కస్టడీ కాలాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న పోలీసులు.. ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలకు చెందిన నివాసాలు, వ్యాపార సముదాయాలలో సోదాలు నిర్వహించారు. కాగా, ఈ కేసులో మరింత లోతైన విచారణను చేస్తున్న పోలీసులు  అత‌ని బ్యాంక్ అకౌంట్ల‌కు చెందిన లావాదేవీల‌పై ఆరా తీసేందుకు ఫోరెన్సిక్ ఆడిట‌ర్ల‌ను నియ‌మించారు.

కాగా, ఈ కేసులో బాలీవుడ్ న‌టి, రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వ‌లేద‌ని పోలీసులు తెలిపారు. కుంద్రాకు చెందిన వియాన్ ఇండ‌స్ట్రీస్ పేరిట ఉన్న ఓ జాయింట్ అకౌంట్ ను ప‌రిశీలిస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. వియాన్ ప‌రిశ్ర‌మే పోర్న్ రాకెట్‌లో కీల‌కంగా మారిందని వారు తెలిపారు. ఆ కంపెనీలో శిల్పాశెట్టి కూడా డైర‌క్ట‌ర్ గా ప‌నిచేస్తున్నారని తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ విషయంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని అన్నారు. కాగా ఈ కేసులో నటి శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.

రాజ్ కుంద్రాకు చెందిన కొన్ని బ్యాంక్ అకౌంట్ల‌లోకి విదేశాల నుంచి డ‌బ్బులు డిపాజిట్ అయిన‌ట్లు గుర్తించామని చెప్పిన పోలీసులు.. అదే విధంగా శిల్పాశెట్టి అకౌంట్లను పరిశీలించిన తరువాత అమెకు విదేశాల నుంచి ఎలాంటి లావాదేవీలు జరిగినట్టు తేలలేదని అన్నారు. ఈ కేసులో ఇప్పటికీ విచార‌ణ కొన‌సాగుతోంద‌ని, బ్యాంక్ అకౌంట్ల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని, ఇప్పుడే శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇవ్వ‌లేమ‌ని ఓ అధికారి తెలిపారు. గ‌త ఏడాది ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు కుంద్రా అకౌంట్లోకి 1.17 కోట్లు వ‌చ్చిన‌ట్లు ఆడిట‌ర్స్ గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles