Revanth Reddy arrested at ‘Fuel Price Hike’ protest పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ ధర్నా

Sonia s government in 2023 says revanth at fuel price hike protest

Telangana Congress, Revanth Reddy, Petrol, Diesel, LPG subsidy gas, Sonia Government, Congress, KCR, Excise Duty, Excise cess, National

Telangana Congress president A. Revanth Reddy has said the Congress was surely coming back to power in 2023 and once “Sonia’s government’ comes Chief Minister K. Chandrashekar Rao and his ‘corrupt’ rule will be probed.”

పెట్రోల్, డీజీల్ ధరలపై కాంగ్రెస్ ధర్నా, రేవంత్ సహా పలువురు అరెస్ట్

Posted: 07/16/2021 03:50 PM IST
Sonia s government in 2023 says revanth at fuel price hike protest

పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుద‌ల‌ను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘చలో రాజ్‌భవన్‌’కు పిలుపుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు హైదరాబాద్ పయనమయ్యారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని హౌస్ అరెస్టులు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి బయలు దేరిన  కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో తమ సహనాన్ని పరీక్షించవద్దని రేవంత్ రెడ్డి పోలీసులకు సూచించారు.

తాము శాంతియుతంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తామ‌ని, ధ‌ర్నాచౌక్ నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తి ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. పోలీసుల ముంద‌స్తు అరెస్టులు, నిర్బంధాలు ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కల్పించేలా వున్నాయని ఆయన దుయ్యబట్టారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు తక్షణం విడిచిపెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. శాంతియుత నిర‌స‌న‌ల‌ను ఇలా అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే ల‌క్ష‌లాది మంది రోడ్డుపైకి వ‌చ్చిఆందోళ‌న నిర్వ‌హిస్తార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఎంత మందిని అరెస్టు చేయించిన‌ప్ప‌టికీ త‌మ నిర‌స‌న కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ప‌న్నుల‌ను పెంచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దోపిడీ చేస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

ప్ర‌జ‌ల ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కొట్లాడేందుకు తాము వెన‌కాడ‌బోమ‌ని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇందిరా పార్క్ వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద జరిగిన సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కార్యకర్తలతో కలిసి రాజ్ భవన్ వైపు పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్ర‌మంలో పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణులకు మధ్య తోపులాట జ‌రిగి ప‌లువురు పోలీసులు కింద‌పడిపోయారు. అనంత‌రం, గవర్నర్‌ అందుబాటులో లేర‌ని, ఆన్ లైన్ లో వినతిపత్రం అందజేయాలని పోలీసులు రేవంత్ రెడ్డికి సూచించారు. తాము అంబేడ్కర్‌ విగ్రహం వరకు తమ ర్యాలీ చేసుకుంటామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ పోలీసులు ఒప్పుకోక‌పోవ‌డంతో కార్యకర్తల భుజాల‌పైకి ఎక్కిన రేవంత్ రెడ్డి బారికేడ్లు దూకారు. ఇదే సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అక్కడినుంచి తీసుకెళ్లారు. రేవంత్ ను అరెస్ట్ చేసే సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రేవంత్ అరెస్ట్ ను ఖండిస్తూ కాంగ్రెస్ కార్యాకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు రేవంత్ తీసుకెళ్తున్న వాహనం వెంట వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలిస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి డీసీఎంలో స్టేషన్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles