Gujarat Tribal Woman Paraded Naked By Husband భార్యను గ్రామంలో నగ్నంగా తిప్పిన భర్త, బంధువులు

Savagery in gujarat s dahod as villagers assault strip parade record 23 year old woman

Gujarat Police, Gujarat tribal Woman striped, Gujarat tribal woman paraded Naked, husband makes wife pared naked, Woman elopes with lover, woman Striped for eloping with lover, tribal woman filmed naked, Dahod tribal woman pareded naked, Tribal Woman, Paraded Naked, Woman elopes with lover, woman Striped, filmed naked, Dahod, Gujarat, Crime

A 23-year-old woman was stripped off her clothes and made to parade around the entire village of the Khajuri village of Dhanpur tehsil of Dahod district of the state of Gujarat. A video was made of the entire incident to make a statement that is quite clear: a woman needs to know her place.

భార్యను నగ్నంగా తిప్పిన భర్త సహా బంధువుల అరెస్ట్

Posted: 07/16/2021 01:30 PM IST
Savagery in gujarat s dahod as villagers assault strip parade record 23 year old woman

గుజరాత్ లో భార్యను నగ్నంగా గ్రామంలో తప్పిన అమె భర్తతో పాటు 18 మంది బంధువులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. గుజరాత్ లోని దహోడ్ జిల్లాలో అమానవీయంగా తన భార్యను గ్రామ ప్రజల ఎదుట నగ్నంగా తప్పిన భర్త, బంధువలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియోలో వున్న 18 మందితో పాటు భర్తను కూడా కటకటాల వెనక్కు పంపారు. అయితే ఈ ఘటన ఈ నెల 6న జరిగిందని పోలీసులు తెలిపారు.

కాగా, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గుజరాత్ లోని దహోడ్ జిల్లాలోని ధన్ పూర్ తహసిల్ పరిధిలో గల ఖజురీ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలోని ఓ వివాహిత తన భర్తను కాదని.. ప్రియుడితో కలసి వెళ్లిపోయింది. అయితే సమాచారం అందుకున్న భర్త, బంధువులు అమెను పట్టుకుని గ్రామానికి తీసుకువచ్చి.. దారుణంగా కొడుతూ అమె వస్త్రాలను లాగేసి నగ్నంగా గ్రామం మొత్తం తిప్పించారు. కొందరు మహిళలు అమె చుట్టూ చేరి అమె వస్త్రాలను లాగేశారు. ఈ క్రమంలో అమె తన భర్తను భుజాలపై మోసుకుంటూ కూడా కొంత దూరం తిప్పించారు.

భర్త తరపు బంధువులు అమె నగ్నంగా నడుస్తున్న సమయంలో తమ సెల్ పోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించి నెట్టింట్లో పెట్టారు. ఈ నెల 6న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట్లో సంచలనంగా మారాయి. దీంతో గుజరాత్ రాష్ట్ర మహిళా కమీషన్ చర్యలు తీసుకోవాలని పోలీసులను అదేశించింది. ఈ క్రమంలో పోలీసులు ఆ ఘటనకు సంబంధించిన 19 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనలో బాధితురాలి భర్తతో పాటు 18 మందిని అరెస్టు చేశామని స్థానిక ధన్ పూర్ పోలిస్ స్టేషన్.. అధికారి బిఎం పాటిల్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles