45,892 Fresh COVID-19 Cases In India, Nearly 5% Higher దేశంలో రికవరీ కేసుల కన్నా కొత్త కేసుల నమోదు అధికం

India reports over 45k new cases of covid 19 in single day nearly 5 higher

Coronavirus, COVID-19, India, coronavirus cases, Coronavirus Cases india, Coronavirus Cases Maharashtra, Coronavirus Cases Kerala, Coronavirus Cases Karnataka, Coronavirus Cases Andhra Pradesh, Coronavirus Cases Tamil nadu, Corona Deaths, corona vaccine, corona second wave

India has reported 45,892 new Covid cases in the last 24 hours, slightly higher than yesterday's figures. The death count climbed to 4,05,028 with 817 fresh fatalities. The mild surge comes amid "Variants of Concern" being reported in several states.

దేశంలో రికవరీ కేసుల కన్నా కొత్త కేసుల నమోదు అధికం

Posted: 07/08/2021 12:33 PM IST
India reports over 45k new cases of covid 19 in single day nearly 5 higher

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే మూడో దశ కేసులు అక్కడక్కడా నమోదు కావడం.. అది మరింత వేగంగా.. మరింత తీవ్రంగా వుంటుందన్న వార్తల నేపథ్యంలో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో కరోనా రెండో ధశ కేసులు కూడా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుడం అందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు రికవరీ కంటే కొత్త కేసుల నమోదు ఎక్కవగా వుండటంతో అటు కేంద్ర అరోగ్యశాఖ తో పాటు ఇటు రాష్ట్రాలు కూడా అందోళన వ్యక్తం చేస్తున్నాయి, దీంతో దేశ ప్రజలు కూడా తీవ్ర అందోళన చెందుతున్నారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో తాజాగా 45,892 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోల్చితే 5 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,07,09,557కి చేరాయి. మహారాష్ట్రలోనే అత్యధికంగా 9500పైచిలుకు కేసులు నమోదు కాగా, ఆ తరువాత కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి, కాగా క్రితం రోజలు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన 817 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో సంభవించిన మరణాల సంఖ్య 4,05,028కు చేరింది. క్రితం రోజున 18,93,800 మంది నమూనాలు సేకరించి, నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

దేశంలో 55 రోజుల తరువాత మళ్లీ కోత్త కేసుల నమోదు అధికంగా నమోదు కావడం కూడా అందోళనకు కారణమవుతోంది. కరోనా రెండోదశలో గత 55 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. కానీ, తాజాగా 44 వేల మంది కోలుకోగా.. 45 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం రికవరీలు 2.98 కోట్ల మార్కును దాటాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.50శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.18 శాతానికి పెరిగింది. 4.6లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న 33,81,671 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 36.48 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. ఇదిలావుండగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏకంగా నలభై లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడి అసువులు బాసారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles