electric scooters get Rs 27,000 price cut in Gujarat ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.50 వేలే.!

Ampere magnus zeal electric scooters price below rs 50 000

Ampere Magnus, Ampere Zeal, electric scooters, 55 kmph speed, 75 km per single full charge, FAME-II Subsidy, Gujarat EV Policy, Gujarat state government, Massive price cut on Electric scooters,

Ampere Vehicles has announced a massive price cut for its electric scooters namely Magnus and Zeal in Gujarat. The said move comes after the latest Gujarat EV Policy 2021 announced by the Gujarat state government and also, FAME-II subsidy revision by the Central government. With the latest revision in price, the two electric scooters by Ampere are now priced under Rs 50,000 in Gujarat.

ఎలక్ట్రిక్ స్కూటర్ ధర అక్కడ కేవలం రూ.50 వేలే.!

Posted: 07/07/2021 06:31 PM IST
Ampere magnus zeal electric scooters price below rs 50 000

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఇప్పుడు అనేక మంది వేచిచూస్తున్నారు. పెట్రోల్ ధరలు రానురాను ఆకాశాన్నంటి మండుతుంటే.. ఇక తమకు ఉపశమనం కల్పించే ఎలక్ట్రిక్ వాహనాల కోసం వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఫేమ్-2 పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు రాయితీలు ప్రకటించింది. దీంతో ఆ రాయితీని వారు వాహనధరలకు తగ్గింపుకు వినియోగిస్తున్నారు, దీంతో ధరలు కూడా తగ్గుతున్నాయి.ఈ తరుణంలో పలు రాష్ట్రాలు కూడా రాయితీలు ప్రకటించాయి. అయితే వాటిని అచరణలో పెట్టింది మాత్రం గుజరాత్ ప్రభుత్వమే. దీంతో ఆక్కడ ఎలక్ట్రిక్ వాహనాల ధర అన్ని రాష్ట్రాల్లో కంటే తక్కువగా వుంది.

ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన ఆంపియర్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుడ్‌న్యూస్‌ అందించింది. ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మకాలను ప్రోత్సహించడానికి గుజరాత్ రాష్ట్రం ఇటీవలే కొత్తగా 2021 ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ ప్రకారం టూ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకునే వాటి ధర మీద రూ. 20,000 సబ్సిడీ అందిస్తుంది. దీంతో అనేక కంపెనీలు ఈ సబ్సిడీ ధరను తగ్గించి ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. తాజాగా ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ కూడా మాగ్నస్, జీల్​ మోడల్ స్కూటర్ల అసలు ధరపై రూ.20,000 తగ్గించింది.

గతంలో ఆంపియర్ మాగ్నస్ స్కూటర్ ధర ₹74,990 ధర కాగా, ఇప్పుడు గుజరాత్ కొనుగోలుదారులు ₹47,990 చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా, జీల్​ మోడల్ స్కూటర్ అసలు ధర ₹68,990 కాగా, ఇప్పుడు ₹41,990 (ఎక్స్ షోరూమ్) ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆంపియర్ ఎలక్ట్రిక్ రాయ్ కురియన్ మాట్లాడాతూ.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు గుజరాత్ ప్రభుత్వం నూతన 2021 ఈవీ పాలసీని ప్రవేశ పెట్టినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న అసాధారణ చర్య వల్ల ఎలక్ట్రిక్ ఒక సామాన్యడికి సులభంగా అందుబాటులో ఉంటున్నాయని ఆయన అన్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పెట్రోల్ ఖర్చులు తగ్గడమే కాకుండా రవాణా ఖర్చుల కూడా భారీగా తగ్గుతాయని ఆయన అన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఈవీ పాలసీలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు ₹20,000సబ్సిడీ, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన కొనుగోలుదారులకు ₹1.5 లక్షల సబ్సిడీని ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 250 కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles