Moderna vaccine to be available in India by July 15. ప్రభుత్వాసుపత్రుల్లో ఈ నెల 15 నుంచి మోడర్న టీకా

Moderna vaccine to be available at select hospitals by mid july

Moderna, moderna Covid vaccine, moderna Covid vaccine in india, July 15th, Government Hospitals, Cipla, corona vaccine

Moderna's Covid-19 messenger RNA (mRNA) vaccine is likely to reach India this week, reported news agency ANI on Monday citing sources. Health officials expect Moderna vaccines to reach hospitals by July 15 for administration, as per reports.

ప్రభుత్వాసుపత్రుల్లో ఈ నెల 15 నుంచి మోడర్న టీకా

Posted: 07/05/2021 07:48 PM IST
Moderna vaccine to be available at select hospitals by mid july

భారతీయులకు అందుబాటులోకి మరో కరోనా వాక్సీన్ వచ్చేస్తోంది. కరోనా మహమ్మారి నుంచి కపాడటంలో ఏకంగా 90శాతం సామర్థ్యం వున్న వాక్సీన్ అందుబాటులోకి రానుంది. ఇటీవల భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి అత్యవసర అనుమతులు పోందిన మోడెర్నా వ్యాక్సిన్ ను ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకురానుంది సిప్లా కంపెనీ. ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసుకుని సిద్దంగా వున్న మోడర్నా వాక్సీన్ ను జులై 15 నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి.

భారత్ లో మోడెర్నా వ్యాక్సిన్ల పంపిణీ కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం వ్యాక్సిన్ డోసులను సిప్లా దిగుమతి చేసుకుంటోంది. వచ్చే వారం నుంచి వీటిని దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించనున్నారు. ఇప్పటికే దిగుమతులు అన్ని ఏర్పాట్లు జరగడంతో వాటిని డీజీసిఐ అదేశాల మేరకు తొలుత వంద మంది ఇవ్వనున్నారు. వీరి అరోగ్యాన్ని కూడా పరీక్షిస్తున్నారు. ఆ తరువాత డీజీసిఐ అదేశాల మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ టీకాలు పరఫరా అవుతున్నాయి.

ఈ క్రమంలో తొలి వంద మంది ఆరోగ్యానికి సంబంధించిన ఏ రోజుకారోజు నివేదికను కూడా భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి సిప్లా సమర్పించేందుకు కూడా సిప్లా కంపెనీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. ఈ షరతుపైనే మోడెర్నా వ్యాక్సిన్ కు భారత్ లో అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చారు. ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేసిన మోడెర్నా కరోనా వ్యాక్సిన్ సమర్థత 90 శాతానికి పైనే ఉండడం విశేషం. అమెరికా, యూరప్ దేశాల్లో మోడెర్నా టీకాల పంపిణీ ఎప్పటినుంచో జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles