Etela questions CM KCR on Dalit CM promise దళితులను మభ్యపెడుతున్న సీఎం.. మోసపోవద్దన్న ఈటెల

Etela rajender questions cm kcr on dalit cm promise

Etela Rajender, CM KCR, Dalit Empowerment, Dalit CM, Election Promise, district tours, TRS, BJP, BJP Vs TRS, Huzurabad, Telangana, Politics

Fomer Minister and BJP Leader Etela Rajender critisizes CM KCR on his recent tourings and Dalit Empowerment, asks what is the extra benifit that dalits had recieved in ths state duing TRS Government. He also questions KCR on Dalit CM promise.

దళితులను మభ్యపెడుతున్న సీఎం.. మోసపోవద్దన్న ఈటెల

Posted: 06/30/2021 04:43 PM IST
Etela rajender questions cm kcr on dalit cm promise

దళితులను మరోమారు మోసం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని  బీజేపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ అందే పథకాలు కాకుండా దళితవర్గాలకు మాత్రమే అందుతున్న పథకాలేమిటో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు చెప్పాలని ఆయన  ప్రశ్నించారు. మరోమారు వంచించేందుకు తెరపైకి దళిత ఎంపవర్ మెంట్ పేరుతో యాత్రలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. హుజూరబాద్ ఎన్నికల నేపథ్యంలో ఈ కొత్త నాటకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తెరలేపారని అన్నారు. ఇందులో ఆర్భాటమే కానీ పసలేదని తేల్చిచెప్పారు.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఏ జాతి వల్ల పదవి దక్కిందో వారిని అగౌరవ పరచొద్దని పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ నిజంగా దళితుల అభ్యున్నతిని కాంక్షించేవారే అయితే తక్షణం తాను చేసిన ఎన్నికల వాగ్ధానం ప్రకారం ముఖ్యమంత్రి పదవిని ఎస్సీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీలకు కేటాయించే నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారన్నారు. రెవెన్యూ సంస్కరణల ద్వారా పెద్దల భూములను దశాబ్దాలుగా సాగుచేసిన దళితులకు నష్టమే చేకూరిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

తెల్ల కాగితంపై రాసుకుని కొనుగోలు చేసిన భూములు మళ్లీ దొరలకే వెళ్లాయిని అరోపించారు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములకు పాసు పుస్తకాలు రాకపోవడంతో దళితవర్గాల వారు అనేక ఇబ్బంది పడ్డారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడేళ్లలో ఎస్సీలకు ఎంతో చేసిండ్రో చెప్పాలని ప్రశ్నించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పరిమితమయ్యాయి. టీఆర్ఎస్ నేతల వల్ల లబ్ధిపొందిన గుత్తేదారులు తప్ప రాష్ట్రంలో మిగతా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇంకా బాలారిష్టలకు గురవుతున్నాయని అరోపించారు. మంత్రులు, పార్టీ నేతలకు విలువ ఇచ్చే సంస్కారం టీఆర్ఎస్ లో లేదని అన్నారు. ఎన్నికలప్పుడు హామీలతో మభ్యపెట్టి గెలవడమే టీఆర్ఎస్ కు తెలుసునని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles