COVID Victims Entitled to Compensation; SC కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి: సుప్రీంకోర్టు

Covid 19 deaths supreme court says ex gratia must leaves it to govt to fix amount

Covid-19 deaths, covid-19, coronavirus deaths, supreme court on ex gratia, covid-19 deaths supreme court ex gratia, ex gratia to covid deaths, compenstation to corona deaths, covid-19 deaths supreme court ex gratia, supreme court, ex gratia, compenstation, National Disaster Management Authority (NDMA)

The Supreme Court on Wednesday ruled that the Centre must pay compensation to the family of those who succumbed to Covid-19, but said the amount of compensation will be decided by government.

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి: సుప్రీంకోర్టు

Posted: 06/30/2021 03:06 PM IST
Covid 19 deaths supreme court says ex gratia must leaves it to govt to fix amount

కరోనా మహమ్మారి సోకి మరణించిన బాధిత కుటుంబాలకు కేంద్రప్రభుత్వం పరిహారం అందించాల్సిందేనని దేఃశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కాగా పరిహారంగా ఎంత మొత్తాన్ని నిర్ణయంచడంతో పాటు.. మృతుల వివరాలను ఎలా సేకరిస్తారన్న విషయంలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపోందించేందుకు ఆరు వారాల గడువును కల్పించింది. ఇటీవల ఈ కేసును విచారణ సందర్భంగా కోవిడ్ కారణంగా మరణించిన ప్రతీ ఒక్కరి కుటుంబాలకు రూ. 4 లక్షల చోప్పున పరిహారం ఇవ్వలేమని కేంద్రం అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. అయితే ఎంత పరహారం ఇస్తారన్న అంశాన్ని కేంద్రప్రభుత్వానికే వదిలేసింది.

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఇవ్వాళ జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రభుత్వ వాదనలను పరిశీలిస్తూ.. బాధిత కుటుంబాలకు ఉపశమనం లభించేలా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కనీస ప్రమాణాలు రూపోందించాలని అదేశించింది. కనీస ప్రమాణాలను రూపోందించడంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. కరోనా బారినపడిన కుటుంబాలకు కొంత మొత్తం చెల్లించవచ్చునని పేర్కోంది.

విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం బాదిత కుటుంబాలకు కచ్చితంగా పరిహారాన్ని అందించాలని అదేశించింది. ఎండీఎంఏ తమ చట్టం ప్రకారం ఎలాంటి మార్గదర్శకాలను పాటించినట్టు రికార్డూ లేదని పేర్కొంది. పరిహారం, ఉపశమనం/సాయం వంటి వాటిని నిర్ణయించడంలో సంస్థ కనీస ప్రమాణాలను పాటించాలని సూచించింది. అయితే, పరిహారంగా రూ.4 లక్షల చొప్పున చెల్లించాలా అన్న అంశంలో  ‘‘ప్రాధాన్యాలు, సాయం వంటి వాటిని ప్రభుత్వమే నిర్ణయించాలి. బాధితులకు ఆహారం, వసతిని ప్రభుత్వమే కల్పించాలి. ప్రభుత్వమే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి”అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles