Madhya Pradesh: 13-Yr-Old Receives "Vaccination Certificate దివ్యాంగ పెన్షన్ కోరితే.. కరోనా టీకా సర్టిఫికేట్

After madhya pradesh s record vaccination 13 year old gets inoculation certificate

13 yr old boy, Vedant Dangre, Rajat Dangre, differntly abled pension, Bhopal boy, Chainendra Pandey, Satna, Nuzhat Salim, Prem Pandya, Ratlam tax consultant, MP national record vaccination, corona vaccine, Vaccination certificate, Coronavirus, vaccination record, Madhya Pradesh, viral news

A week after the Madhya Pradesh government set a “national record” by administering Covid-19 vaccines to over 16 lakh people on June 21, allegations have emerged that many beneficiaries did not even get a single dose of the shot.

దివ్యాంగ పెన్షన్ కోరితే.. కరోనా టీకా: ఎంపీ అధికారుల నిర్వాకం

Posted: 06/29/2021 01:39 PM IST
After madhya pradesh s record vaccination 13 year old gets inoculation certificate

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ రాష్ట్రం జాతీయ రికార్డును సాధించాలనే ఆసక్తి నేపథ్యంలో ఇతర ప్రభుత్వ పథకాల కోసం ధరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు కూడా కరోనా టీకాను వేసినట్లు ధృవీకరించారు. ఇక వీరి నిర్లక్ష్యం ఎంతటి పరాకాష్టకు  చేరిందంటే ఏకంగా 13 ఏళ్ల బాలుడికి కూడా కరోనా వాక్సీన్ ఇచ్చేసినట్టు అతని తండ్రి సెల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ అందించడమే కాకుండా ఏకంగా ఆ పిల్లాడికి కరోనా వాక్సీన్ తీసుకున్నట్లుగా సర్ఠిఫికెట్ కూడా జారీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. గత సోమవారం రాత్రి 7.27 గంటలకు భోపాల్ లో నివాసం ఉంటున్న రజత్ దాంగ్రే ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. అందులోని సమాచారం ఏంటంటే... రజత్ కుమారుడు వేదాంత్ దాంగ్రేకు కరోనా టీకాను వేయడం జరిగింది. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ సమాచారం రాగానే రజత్ అవాక్కయ్యారు. ఇంతవరకూ దేశంలో 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేసేందుకు అనుమతులే లేకపోగా, 13 ఏళ్ల తన కుమారుడికి ఎప్పుడు, ఎక్కడ, ఎవరు వ్యాక్సిన్ వేశారా? అని అయోమయంలో పడ్డాడు.

ప్రభుత్వం నుంచి వచ్చిన మెసేజ్ లో వేదాంత్ వయసు 56 సంవత్సరాలుగా పేర్కొనడం గమనార్హం. ఈ సమాచారాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వెంటనే అందులోని లింక్ ను ఓపెన్ చేసి చూడగా, వ్యాక్సిన్ వేసినట్టు సర్టిఫికెట్ కూడా వచ్చిందని రజత్ తెలిపారు. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసేందుకు వెళ్లి విఫలం అయ్యానని, దివ్యాంగుడైన తన కుమారుడికి పెన్షన్ కోసం ఇటీవల మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి, కొన్ని ధ్రువపత్రాలను ఇచ్చానని, వాటిని అధికారులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ఈ నెల 21న మధ్యప్రదేశ్, వ్యాక్సినేషన్ లో జాతీయ రికార్డును సృష్టిస్తూ, 17.42 లక్షల మందికి టీకాలను ఇచ్చామని చెప్పుకుంటున్నా.. ఇందులో ఎందరికి సక్రమంగా టీకాలను వేశారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే చాలా మంది తాము టీకాలు తీసుకోకున్నా, తమ సెల్ ఫోన్లకు టీకా తీసుకున్నట్టు సమాచారం, ఆ వెంటనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వస్తోందని ఆరోపించారు. దీంతో తమ పేరున టీకాలు తీసుకున్నట్లు సమాచారంతో తాము ఇక ఇప్పుడు ఎక్కడ టీకాలు తీసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇక అదే రోజున సాత్నా జిల్లాలో ఉండే చినేంద్ర పాండేకు ఐదు నిమిషాల వ్యవధిలో ముగ్గురికి టీకాలు వేసినట్టుగా మెసేజ్ లు వచ్చాయి. అయితే ఆ ముగ్గురు వ్యక్తులతో తను కు ఎలాంటి సంబంధం లేదని, వారెవరో కూడా తనకు తెలియదని అతను ఆరోపించారు. భోపాల్ లోనే ఉండే నుజహత్ సలీమ్ (46)కు ఎటువంటి పెన్షన్ రాకున్నా, ఆమె పెన్షనర్ అని ప్రూఫ్ చూపుతూ వ్యాక్సిన్ వేసినట్టుగా మెసేజ్ వచ్చింది. అమెను పెన్షనర్ కాకపోయినా అమె కరోనా టీకాకు పెన్షన్ తీసుకునే ధృవపత్రాన్ని జతచేయడం గమనార్హం.

ఇక ప్రేమ్ పాండ్యా అనే మరో వ్యక్తి తాను వాక్సీన్ తీసుకునేందుకు రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే కొరత వుందన్న సమాచారంతో వేచిచూస్తుండగా, అతను కూడా వాక్సీన్ తీసుకున్నట్లు సమాచారం రావడంతో ఖంగుతిన్నాడు. తన పేరున తొలి డోసు తీసుకున్నట్లు వచ్చిందని అయితే తాను తీసుకోలేదని ప్రేమ్ పాండ్యా పేర్కోన్నారు. ఇలా మున్సిఫల్ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లో అధికారులు తమ వద్దనున్న సమాచారాన్ని దుర్వినియోగం చేసి టీకాలు తీసుకున్నట్లు నమోదు చేశారని బాధితులు అరోపిస్తున్నారు. వీరే కాదు... ఇంకా చాలా మంది ఇటువంటి అనుభవాలనే ఎదుర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles